మీరు చూస్తుంది నిజమే అండి.చిరంజీవి ఏడవడం వల్లనే డైరెక్టర్ వంశి రోడ్డున పడ్డాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే చిరంజీవి మంచు పల్లకి సినిమాలో క్లైమాక్స్ లో సుహాసిని చనిపోతే గీత అంటూ ఏడవాలి.సీన్ అద్భుతం గా వచ్చింది.
కానీ నలుగురిని కొడితే మాత్రమే అతడు హీరో చిరంజీవి అవుతాడు అని నమ్మిన అయన ఫ్యాన్స్ పెదవి విరిచారు.ఈ చారు హాసన్ సినిమా కు రీమేక్.
మొదట అయన ఈ సినిమా చూసి ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయారు.తరువాత చాల మంది తన కుటుంబ సభ్యులకు షో వేయించి మరి చారు హాసన్ చూపించారు.
కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతి చిరంజీవి గీత అంటూ చెప్పిన సీన్ బాగుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
అప్పుడు సుహాసిని వంశీని దర్శకుడు అంటూ పరిచయం చేయగా ఈ పిల్లడు ఇంత గొప్ప సినిమా తీసారా అంటూ కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయింది.
చారు హాసన్ కుటుంబాన్ని పంపిన్చేసి వెనక్కి వచ్చాక బాలు చెల్లెలు వసంత సైతం చిరంజీవి ఏడుస్తూ చేయడం బాగుంది అంటూ కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయిది.ఆ తర్వాత రామ నాయుడు కి స్పెషల్ షో ఒకటి వేయించి చూపించగా అయన కూడా చిరంజీవి క్లైమాక్స్ లో ఏడ్చే సీన్ బాగుంది అని చెప్పారు.
ఇక సురేష్ మహల్ ప్రివ్యూ థియేటర్ లో దర్శకుడు విశ్వనాధ్ గారు చూసి చిరంజీవి గొప్పగా చేసాడు అంటూ తన శిష్యుడు అయినా వంశీని చూసి మెచ్చుకున్నారు.ఇక సినిమా విడుదల అయినా తర్వాత జనం ఏం అంటారో అని భయంగానే ఉన్నాడు వంశి.
అయన అనుకున్నంత పని అయ్యింది.
చిరంజీవి గీత అంటూ ఎడుస్తుంటే యూత్ ఏవోవో పిచ్చి కామెంట్స్ చేసారు.వీడేంట్రా ఇలా ఏడుస్తున్నారు అని గీత గీత అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.ఇక సినిమా కూడా 50 రోజులకే మంచు పల్లకి అటకెక్కింది.
అప్పటి దాకా నిర్మాత నెలకు 650 రూపాయలు ఇచ్చేవారు అది కూడా ఆగిపోయింది.మల్లి ఎవరు పిలిచి అవకాశం ఇవ్వలేదు.
ఇక వంశి పని అయిపొయింది అనుకుంటున్నా టైం లో ఏడిద నాగేశ్వర్ రావు గారి దగ్గరి నుంచి మంచి కథ ఉంటె పట్టుకొనిరా అనే పిలుపు వచ్చింది.దాంతో మంచి కింద పెట్టెలో ఉన్న కోకిల సినిమా కథతో వెళ్లి ఎక్కడ వెనుతిరిగి చూడలేదు.
ఆలా మహామహులు మెచ్చుకున్నా మంచు పల్లకి జనాల చేత మెప్పు పొందలేదు.