రవితేజ.మాస్ మహరాజ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే ఖిలాడీ సినిమాను పూర్తి చేశాడు.ఆ తర్వాత రామారావ్-ఆన్ డ్యూటీ అనే సినిమాను చేస్తున్నాడు.అటు త్రినాథరావుతో కలిసి ధమాకా అనే సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉండగానే తాజాగా తన 71వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు.అభిషేక్ అగర్వాల్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు.చాలా గ్యాప్ తర్వాత యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.మది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.అంతేకాదు.ఈ సినిమాకు సంబంధించి టైగర్ నాగేశ్వర్ రావు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కు మాంచి స్పందన వస్తోంది.
ఈ సినిమా రవితేజ కెరీర్ లో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది.అంతేకాదు.ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్ అంటూ పోస్టర్ వేశారు.ఇందులో కేవలం రవితేజ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా ఓ వ్యక్తికి సంబంధించిన బయోపిక్ గా తెరకెక్కింది.అయితే ఇంతకీ ఈ టైగర్ నాగేశ్వర్ రావు ఎవరు అనే అంశంపై చర్చ నడుస్తోంది.
ఇంతకీ తను ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.
నాగేశ్వర్ రావు అనే వ్యక్తి స్టూవర్టుపురంలో ఫేమస్ దొంగ.అతడు స్కెచ్ వేసి దొంగతనం చేస్తే.తిరుగు ఉండేది కాదు.
పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడు.ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తున్నట్లు పక్కా సమాచారం.ఈ సినిమాను కమర్షియల్ మూవీగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నాడు.
వీలైనంత త్వరలో టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.