గత కొన్నాళ్లుగా టీడీపీ జనసేన మద్య పొత్తు అంశం పదే పదే ప్రస్తావనకు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసే బరిలోకి దిగుతాయని అందులే ఎలాంటి సందేహం లేదని వైసీపీ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు.
అయితే ఇలాంటి విమర్శలను అటు టీడీపీ గాని, ఇటు జనసేన గాని ఖండించింది లేదు.అంతే కాకుండా చంద్రబాబు పవన్(Pawan kalyan) ఆయా సందర్భాల్లో భేటీ అవుతూ.
ఇరు పార్టీల మద్య పొత్తు కన్ఫర్మ్ అనే సంకేతాలను చెప్పకనే చెబుతున్నారు.అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ రెండు పార్టీల మద్య ఇంకేదో జరుగుతోంది అనే సందేహం రాక మానదు.
ఇక అసలు విషయంలోకి వెళితే. టీడీపీకి సంబంధించిన కొందరు నేతలు జనసేన వైపు చూస్తుండడం.అలాగే జనసేనలో చేరతారని భావించిన వాళ్ళు టీడీపీలో చేరడం వంటివి చూస్తుంటే ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.టీడీపీ కి సంబంధించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి చేరతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు(Edara Haribabu) 1994లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పని చేశారు.ఆ తరువాత కొన్నాళ్ళకు ఆయన బీజేపీలో చేరినప్పటికి ప్రస్తుతం ఆయన జనసేనలో చేరానున్నట్లు తెలుస్తోంది.
అలాగే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవి రామారావు 2009 లో టీడీపీ తరుపున గెలుపొందారు.
ఆ తరువాత ఈయన వైసీపీలో చేరినప్పటికి ప్రస్తుతం రైజింగ్ లో ఉన్న జనసేనలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక జనసేనలో చేరతారని భావించిన కన్నా లక్ష్మినారాయణ, రాజేశ్ మహాసేన వంటివాళ్లు టీడీపీలో చేరారు.కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేసిన తరువాత జనసేనలో చేరతారని బలంగా ప్రచారం జరిగింది.
కానీ అనూహ్యంగా ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.ఇక సోషల్ మీడియాలో వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ గుర్తింపు పొందిన మహాసేన రాజేశ్ (Mahasena rajesh)మొదటి నుంచి కూడా పవన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు.
కట్ చేస్తే ఆయన టీడీపీ గూటికి చేరారు.ఈవిధంగా టీడీపీలో చేరతారని భావించిన వాళ్ళు జనసేనలోనూ.
అలాగే జనసేనలో చేరతారని భావించిన వాళ్ళు టీడీపీలోనూ చేరడం చూస్తుంటే.రెండు పార్టీల మద్య అసలేం జరుగుతోంది అనే సందేహం రాకమానదు.