రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield)మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందింది.దీని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఇదే తరహాలో హోండా కంపెనీ హోండా సీబీ 350 (Honda CB350)పేరుతో స్టైలిష్ లుక్స్ ఉండే కొత్త బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.బైక్ కొనాలనుకునేవారు మొదటగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ఒక లుక్ కచ్చితంగా వేస్తారు.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్టైలే వేరు.అంతలా మార్కెట్లో క్రేజ్ క్రియేట్ చేసుకుంది.
దీనికి పోటీగా హోండా గట్టి పోటీ ఇస్తూ కొత్త బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.క్రుయిజర్ సెగ్మెంట్లో వస్తున్న ఈ బైక్ మంచి లుక్ తో ఉంటుంది.
రెండు మోడల్ లతో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది.దీని ప్రారంభ ధర 1.50 లక్షల నుండి మొదలవుతుంది.మునుపటి ఫీచర్లను అప్డేట్ చేసి సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది.
ఒకరకంగా అమ్మకాల పరంగా ఈ బైక్ చాలా వెనుకబడి ఉండేది.మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు హోండా అడుగులు ముందుకు వేసింది.అందులో భాగంగా బైక్ లో చాలా మార్పులు చేసింది.బ్రేక్ వేసినప్పుడు వెనుక వాహనాలు అలర్ట్ అయ్యేలా చేస్తుంది.దీని సిలిండర్ లో మార్పు చేయడం, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ బైక్ లలో 349 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది.5 స్విఫ్ట్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంటాయి.దీని షోరూం ధర రూ.2.10 లక్షల నుండి ఉంటుంది.స్టైలిష్ బైక్ కావాలి అనుకునేవారు ఈ బైక్ పై ఒకసారి లుక్ ఇస్తే కొనకుండా ఉండలేరు.