వైరల్: వివాహ వేడుకలో వధువు వరుడికి, అతిథుల కళ్లకు గంతలు కట్టింది.. ఎందుకంటే?

Viral: The Bride Blindfolded The Groom And The Guests At The Wedding Ceremony Because , Viral Video, Bride Blindfolded Groom, Wedding Ceremony, Indian Tradition, Lucy , England, Viral News, Latest News,

భారతీయ సాంప్రదాయం( Indian tradition )లో వివాహానికి పెద్ద పీట వేశారు.అందుకే పాశ్చాత్యులు మనదేశం గురించి మాట్లాడుకొనేటప్పుడు అందులో ఖచ్చితంగా పెళ్లి టాపిక్ వుంటుంది.

 Viral: The Bride Blindfolded The Groom And The Guests At The Wedding Ceremony Be-TeluguStop.com

అవును, వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ అద్భుతమైన ఘట్టం.అందుకే తమ తమ వివాహ వేడుక ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచి పోవాలని ప్రతి ఒక్కరూ కళలు కంటూ వుంటారు.

అందుకోసం ప్రత్యేక ప్రణాళికలను కూడా రూపొందిస్తూ వుంటారు.ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ కు చెందిన ఓ మహిళ తన పెళ్లి రోజును ప్రత్యేకంగా మార్చుకునేందుకు ఓ అధ్బుతమైన ఆలోచన చేసింది.

కాగా ఆ ఆలోచన పెళ్లికి హాజరైన వారందరి చేత కంటతడి పెట్టించింది.

అవును, వివాహాలు ఇపుడు మనదగ్గరే కాదు, ఫారిన్ దేశాలలో కూడా ఎంతో వైభవంగాను చాలా ఎమోషనల్ గాను జరుగుతూ వుంటాయి.విషయంలోకి వెళితే, ఇంగ్లండ్‌( England )లోని బర్మింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్న లూసీ ఎడ్వర్డ్స్ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్ ఒల్లీ కేవ్‌ను లండన్‌( London )లో వివాహం చేసుకుంది.కాగా ఆ వివాహ వేడుకకు హాజరైన వారందరూ తమ తమ కళ్లకు గంతలు కట్టుకున్నారు.

వరుడు కూడా తన కళ్లకు గంతలు కట్టుకున్నారు.ఆ వివాహ వేడుక జరిగినంత సేపూ అందరూ అలాగే వుండడం గమనార్హం.

అయితే పెళ్లి కూతురు లూసీ అలా ప్లాన్ చేయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది.ఎందుకంటే లూసీ ఒక అంధురాలు కాబట్టి.అవును, ఆమె 2 నెలల వయసులో జన్యుపరమైన సమస్య కారణంగా తన చూపుని కోల్పోయింది.కాగా చూపు లేని లూసీని ఒల్లీ ఇష్టపడ్డాడు.ఈ క్రమంలో ఇద్దరూ కొద్ది కాలం సహజీవనం కూడా చేశారు.ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అతిథులను పిలిచారు.

అయితే పెళ్లికి హాజరయ్యే వారందరూ కళ్లకు గంతలు కట్టుకోవాలని సూచించారు.కాగా వధువు లూసీ( Lucy ) పెట్టిన నిబంధనను అర్ధం చేసుకున్న బంధువులు ఆనందంగా అంగీకరించారు.ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.9 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube