మనకి తెలిసినంత వరకు కూరగాయల ధరలు పదిలల్లో ఉంటుంది.కానీ ఈ రైతు పండించే పంటకు వేలల్లో ధర పలుకుంది.
అయితే ఇంతకీ ఆ రైతు ఏం పంట పండిస్తుండు అని తెలుసుకోవాలని ఉందా.అయితే ఇఇ వార్త చదివేయండి మరి.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రస్తుతం బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల అమ్రేశ్ సింగ్ రైతు ‘హాప్ షూట్స్‘ అనే పంటను పండిస్తున్నాడు.
ట్రయల్ బేసిస్‌లో వీటి సాగును ప్రారంభించినట్లు ఆయన చెబుతున్నారు.
ఔరంగాబాద్ జిల్లాలోని కరందిహ్ గ్రామానికి చెందిన అమ్రేశ్.
ఇతర ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలను కూడా సాగు చేస్తున్నాడు.మన దేశంలో హాప్ షూట్స్ పంటను అరుదుగా సాగు చేస్తారు.
వీటిని ప్రత్యేక ఆర్డర్లతోనే కొనుగోలు చేస్తారు.ప్రస్తుతం వీటి సాగు విజయవంతంగా కొనసాగుతోందని అమ్రేశ్ తెలిపారు.
దీన్ని సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తే, రైతులకు ఇతర పంటలకంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన వివరిస్తున్నారు.
ఇక హాప్ షూట్స్ పూర్తిపేరు హ్యుములస్ లుపులస్.అంతర్జాతీయ మార్కెట్లలో దీని ధర కిలోకు 1000 యూరోల వరకు, మన కరెన్సీలో రూ.85,000 వరకు ఉంటుంది.ఈ పంటను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పండిస్తున్నారు.
అయితే హాప్ షూట్స్ మొక్క ఆకులు, పువ్వులు, కాయలను యాంటీ బయోటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉన్నది.ఈ మొక్క తో బీర్‌ను తయారు చేస్తారు.
ముఖ్యంగా టీబీ చికిత్సకు ఉపయోగించే ఔషధాల్లో ఉపయోగిస్తారు.అందుకనే ఈ పంటకు ఖరీదు చాలా ఎక్కువ.
ఈ పంటను తనకు సాగు చేయమని వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ సజెస్ట్ చేశారని ఆమ్రేష్ చెప్పాడు.ఇప్పుడు ఈ పంట పెరుగుదల ఆ పరిసర ప్రాంతాల్లో విజయవంతం కావడంతో గ్రామంలోని మిగతా రైతులు కూడా హాఫ్ షూట్స్ ను పెంచడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
దీంతో అక్కడ రైతుల ముఖ చిత్రం త్వరలో మారనుంది.