వైరల్: తాబేలు, కుక్కపిల్ల మధ్య స్నేహం చూసారా? కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్నాయి

ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.దానికి కారణం అందరికీ తెలిసినదే.

 Viral: Have You Seen The Friendship Between A Turtle And A Puppy? Playing Footba-TeluguStop.com

ఆ మూగజీవాలు ఏం చేసినా మనిషికి ఆనందం కలుగుతుంది.అవి ఏం చేసినా ముచ్చటగా కనిపిస్తుంది.

ఇక్కడ కూడా అదే జరిగింది.తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో ఒక బుల్లి తాబేలు, బుజ్జి కుక్కపిల్ల కలిసి ఫుట్‌బాల్ వాడుతుండటం మనం గమనించవచ్చు.ట్విటర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక వీడియో చూసినట్లయితే, ఈ రెండు బుల్లి జంతువులు పూర్తిగా ఆటలో నిమగ్నమైపోయాయి.అవి ఒకదాని తరువాత ఒకటి నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఫుట్‌బాల్‌ను తన్నడం ఇక్కడ గమనించవచ్చు.

ఈ వీడియో చూడటానికి చాలా క్యూట్ గా అనిపించడంతో ఆహుతులను అలరిస్తోంది.గాబ్రియెల్ కార్నో అనే అతను ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది.ఈ వీడియోను ఇప్పటివరకూ దాదాపు 1.9 మిలియన్ల మంది వీక్షించడం కొసమెరుపు.

అంతేకాదు ఈ వీడియో 56000 లైక్స్ సంపాదించడం విశేషం.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.సదరు వీడియోని చూసిన ఒక యూజర్ “నా జీవితంలో నేచూసిన వేగవంతమైన తాబేలు ఇదే” అని కామెంట్ చేయగా, మరొక యూజర్ ఆహా అద్భుతం.ఈ జంతువులు ఇలా కలిసి ఆడటం నేను ఎప్పుడూ చూడలేదు.అని కామెంట్ చేసాడు.ఇంకొకరునిజంగా నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను, వీటి మధ్య అంతమంచి సఖ్యత వుందా? స్నేహమంటే ఇదేనేమో అని కామెంట్ చేసాడు.ఇంకెందుకాలస్యం, మీరు కూడా ఇక్కడ వున్న వీడియోని తిలకించి అభిప్రాయాలను తెలియజేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube