సెప్టెంబర్ 20 నుంచి గ్రామ సచివాలయ పరీక్షలు..!

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.సెప్టెంబర్ 20వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

 Andra Pradesh, Secretariat Exam, Exam Date, Cm Jagan, Ministers Botsa Satyanaray-TeluguStop.com

విజయవాడలో బుధవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు.

వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు.మొదటి రోజే సుమారు 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.దాదాపు మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇక పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube