తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెలుగు లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా ను నిర్మిస్తున్నాడు అంటూ ఇన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.నేడు విజయ్ బర్త్ డే సందర్బంగా అంతా క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా రూపొందుతున్నది తెలుగు లో కాదు తమిళంలో అని వారికి వారే స్పష్టంగా చెప్పేశాడు.ఈ సినిమా ను తమిళం లో రూపొందించి తెలుగు లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
పైగా యూనిట్ సభ్యులు సినిమా ను తెలుగు లో షూట్ చేస్తున్నాం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అంటూ విజయ్ తెలుగు అభిమానులు అంటున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ మొదట తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చింది.
తమిళం లోనే టైటిల్ ను రివీల్ చేయడం జరిగింది.దాంతో ఈ సినిమా ను ఖచ్చితంగా తమిళం లోనే రూపొందిస్తున్నారు.
అందుకే మొదట తమిళ టైటిల్ ను ప్రకటించారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలుగు లో ఈ సినిమా ను వారసుడు అంటూ విడుదల చేయబోతున్నారు.తెలుగు లో సినిమా ను రూపొందిస్తే మొదట తెలుగు టైటిల్ వారసుడు ను ప్రకటించ వచ్చు కదా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ఈ సినిమా విషయంలో గందరగోళం కనిపిస్తుంది.మహర్షి వంటి హిట్ సినిమా ను రూపొందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా ను చేస్తున్న కారణంగా అంచనాలు భారీ గా ఉన్నాయి.
కాని ఈ సినిమా ను డబ్బింగ్ సినిమా గా తెలుగు లో విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తుండటంతో అభిమానులు నిరాశ తో ఏంటి రాజు గారు ఇది డబ్బింగ్ సినిమా ను చూడాలా మేము అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.