యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా కెరీర్ ను ప్రారంభించి సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.ట్యాక్సీవాలా సినిమా తరువాత విజయ్ హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా విజయ్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల విజయాలు విజయ్ మార్కెట్ ను పెంచడంతో పాటు నటుడిగా విజయ్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
విజయ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదలైంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై భారీగా అంచనాలు పెరగగా ఈ సినిమా బడ్జెట్ 125 కోట్ల రూపాయలని తెలుస్తోంది.పాన్ ఇండియా మూవీ కావడంతో ఇంత భారీ మొత్తం ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారని సమాచారం.
సినిమాలో విజయ్ ఫైటర్ పాత్రలో కనిపిస్తుండగా ఇంత భారీ బడ్జెట్ సినిమాలో విజయ్ నటించడం ఇదే తొలిసారి.
పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది.బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పూరీ జగన్నాథ్ భారీ లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.
దాదాపు సగం షూటింగ్ ఇప్పటికే పూర్తైందని ఈ ఏడాది సమ్మర్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రమ్యకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించనున్నారు.ప్రభాస్ మినహా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మిగతా హీరోలు ఎవరూ సక్సెస్ కాలేదు.
విజయ్ లైగర్ సినిమాతో బాలీవుడ్ లో హీరోగా సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.
.