టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay deverakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు విజయ్ దేవరకొండ.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.శివ నిర్మాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా ఇటీవలే కోటి రూపాయలను వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇచ్చిన మాట ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చెక్‌ను స్వయంగా అందించారు.ఈ మేరకు హైదరాబాద్‌లో స్ప్రెడింగ్ ఖుషి అనే ఈవెంట్( Kushi )ను నిర్వహించి చెక్‌లు అందజేశారు.
ఈ విధంగా 100 కుటుంబాలకు సాయం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.అంతేకాకుండా అందరికీ చెక్కులు అందజేసి వారందరితో కలిసి సరదాగా ఒక సెల్ఫీ ని కూడా దిగారు.
ఇదే విధంగా ప్రతి ఏడాది, తాను సినిమాలు చేసినంత కాలం ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాను అని ప్రకటించారు విజయ్.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.ఏవేవో చేయాలనిపిస్తుంది.ఈరోజు మీతో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను.చేయాలనుకున్నవి చేయగలుగుతున్నా అంటే ఈ శక్తి, సంపాదన, స్థాయి, ధైర్యం నాకు ఇచ్చినందుకు నా అమ్మ నాన్నలకి, తెలుగు ప్రజలకి, నా టీమ్‌కి, ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి.నేను యాక్టర్ అయినప్పటి నుంచీ ఇవన్నీ చేస్తున్నాను.
కానీ ఎవ్వరికీ తెలియనది ఏంటంటే ఇవన్నీ నా వ్యక్తిగత కోరికలు.అంటే, నేను పెరుగుతున్నప్పుడు ఇవన్నీ నేను కోరుకున్నాను.
ఈరోజు ఆ కోరికలను నేను తీరుస్తున్నాను అని తెలిపారు విజయ్.నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు నా స్నేహితులందరూ కాలేజ్ ట్రిప్‌కు వెళ్లారు.
కానీ నేను ఆ ట్రిప్‌కి వెళ్లడానికి ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టలేక, ఖర్చులు పెంచడం ఇష్టంలేక ఆ ట్రిప్‌కి వెళ్లలేదు అని తెలిపారు విజయ్ దేవరకొండ.
అయితే, ఆ ట్రిప్‌కు వెళ్లనందకు చాలా ఫీలయ్యానని, ఫ్రెండ్స్ అంతా అక్కడ ఏం చేస్తున్నారోనని ఆలోచించేవాడిని అని అన్నారు.ఆరోజు వెళ్లలేకపోయాను కాబట్టే ఈరోజు తాను సంపాదిస్తుండడం వల్ల గతేడాది 100 మంది స్కూలు పిల్లలను వాళ్ల ఫస్ట్ హాలీడేకు పంపించామని తెలిపారు.మీకు ఇచ్చిన ఈ లక్ష రూపాయలు మీ లైఫ్ లో ఎంతో కొంత సంతోషాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను.
ఇది కొంచెం ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను.నాకు ఎవరూ థాంక్యూలు అవీ చెప్పొద్దు.ఇది మీతో షేర్ చేసుకోవాలి అంతే.కానీ ఒక్క బాధ ఏంటంటే కేవలం 100 కుటుంబాలకు మాత్రమే సాయం చేయగలుగుతున్నాను.
నేను వైజాగ్( Visakhapatnam )లో ప్రకటించిన వెంటనే మాకు దాదాపు 50వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి.మేము ఒక్కరోజు మాత్రమే ఉంచి ఆపేశాం.
ఎందుకంటే మేమిచ్చేది 100 కుటుంబాలకు మాత్రమే కాబట్టి.ఆ 50వేల కుటుంబాల్లో మా టీమ్ ఇక్కడున్న 100 కుటుంబాలను ఎంపిక చేసింది.
ఇంకా ఎంతో మందికి చేయాలనే కోరిక నాకు ఉంది.ప్రస్తుతానికి నేను చేయలేను.
కానీ, దరఖాస్తు చేసుకుని నా సాయం అందుకోలేకపోయిన కుటుంబాలకు మాటిస్తున్నా నాకు సంపాదన ఉన్నన్నిరోజులు నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా సాయం చేస్తూనే ఉంటాను.ఈరోజు 100 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి.
మిగిలిన వారందరి దగ్గరికి నేను చేరుకోలేకపోయి ఉండొచ్చు.రాబోయే ప్రతి సంవత్సరం ఇంకొందరి దగ్గరికి, మరికొందరి దగ్గరికి చేరుకుంటూనే ఉంటాను అంటూ మాట ఇవ్వడంతో పాటు తన గొప్ప మనసును చాటుకున్నారు విజయ్ దేవరకొండ.