టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల సరసన విజయ్ దేవరకొండ నిలిచాడు.ఈయన నటించిన కేవలం రెండు సినిమాలు ఈయన్ను సూపర్ స్టార్ చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రెండు సినిమాలతో స్టార్‌డంను దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘నోటా’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.తెలుగులో ఈ చిత్రం ఎలా ఉన్నా ప్రేక్షకులు చూస్తారు.
ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక తమిళ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.తాజాగా తమిళ వర్షన్‌కు సెన్సార్ బోర్డు సెన్సార్ చేసేసింది.తమిళ ‘నోటా’కు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.
విజయ్ దేవరకొండ గత రెండు సినిమాలు చూసుకుంటే ముద్దు సీన్స్ హద్దులు మీరినట్లుగా ఉన్నాయి.అందుకే ఈ చిత్రంలో కూడా ముద్దు సీన్స్ ఉండాలని అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.
నోటాలో కూడా ముద్దు సీన్ ఉందని ప్రచారం జరుగుతుంది.
తాజాగా క్లీన్ యూ ఇవ్వడంతో ముద్దు సీన్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరో వైపు విజయ్ దేవరకొండ కూడా సెన్సార్ బోర్డు విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.తన సినిమాకు క్లీన్ యూ వస్తే ప్రేక్షకులు ముఖ్యంగా తనను అభిమానించే వారు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
తెలుగులో అయినా ఈ సినిమాకు యూ/ఎ లేదా ఎ రావాలని ఆయన కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఈమద్య కాలంలో క్లీన్ యూ సినిమాలకు పెద్దగా ఆధరణ దక్కడం లేదు.
అందుకే విజయ్ దేవరకొండ ఇలా ఆలోచిస్తూ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.