జంతు సామ్రాజ్యం ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.మనుగడ కోసం అవి చేసే క్రూరమైన పనులు చూస్తే ఒక్కోసారి షాకింగ్‌గా అనిపిస్తుంది.
తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో కొమోడో డ్రాగన్, భారీ పాము (Komodo dragon, a huge snake)మధ్య జరిగిన పోరాటం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ఈ వీడియోలో కొమోడో డ్రాగన్ పక్కా ప్రణాళికతో, శక్తివంతమైన దాడితో పామును మట్టుబెట్టడం చూస్తుంటే, ప్రకృతి ఎంత కఠినమైనదో అర్థమవుతుంది.
వైల్డ్‌లైఫ్ అన్‌సెన్సార్డ్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక కొమోడో డ్రాగన్(Komodo dragon) పరిమిత ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద పామును టార్గెట్ చేసింది.పాము(Snake) తన ప్రాణాల కోసం ఎంతగానో పోరాడుతూ మెలికలు తిరిగినా, ఆ డ్రాగన్ బలం, కచ్చితత్వం ముందు దాని ఆటలు సాగలేదు.
క్షణాల్లో ఆ కొమోడో డ్రాగన్ తన బలమైన దవడలతో పామును గట్టిగా పట్టుకుంది.ఆ తర్వాత దాన్ని నమలడం మొదలుపెట్టింది.పాముకు తప్పించుకునే ఛాన్స్ లేకుండా చేసింది.
ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియకపోయినా, దాని భయానక దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కట్టిపడేశాయి.2025 జనవరి 14న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షన్నర కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ఒక యూజర్ “విషం కంటే దవడలే పవర్‌ఫుల్” అంటూ డ్రాగన్ బలాన్ని మెచ్చుకున్నారు.మరొకరు “వేటాడే జంతువులు ఎప్పుడూ తల లేదా గొంతునే టార్గెట్ చేస్తాయి” అంటూ కొమోడో డ్రాగన్ టెక్నిక్‌ను అభినందించారు.
ఇంకొకరు సరదాగా “గాడ్జిల్లా ఐడియా అక్కడి నుంచే వచ్చిందన్నమాట” అని కామెంట్ చేశారు.అయితే, కొందరు మాత్రం ఈ వీడియోను చూసి “భయానకం” అని అభివర్ణించారు.వణుకు పుట్టించే ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.