యూఎస్ వీసా .. ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం, చర్యలు తీసుకుంటున్నామన్న అమెరికా ప్రభుత్వం

భారతదేశానికి కాన్సులర్ అధికారుల కేడర్‌ను పంపపడంతో పాటు వీసా దరఖాస్తుదారుల కోసం జర్మనీ, థాయ్‌లాండ్‌లలో రాయబార కార్యాలయాలను తెరుస్తున్నట్లు వీసా సేవలకు సంబంధించి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ పీటీఐకి వచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.ప్రధానంగా భారత్‌లో వీసా నిరీక్షణ సమయాన్ని తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.

 Us Govt Trying To Eliminate Delay In Visa Wait Times In India , Visa Wait Times-TeluguStop.com

ఈ మేరకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీసా కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడం తమ తొలి ప్రాధాన్యత అని ఆమె అన్నారు.

Telugu Covid, India, Indian, Visas, Embassy, Visa Wait Times-Telugu NRI

భారతదేశంలో తమ ఎంబసీ , కాన్సులేట్‌లలో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న తమ సిబ్బందికి సహాయం చేయడానికి తాము కాన్సులర్ అధికారుల కేడర్‌ను పంపుతున్నట్లు తెలిపారు.పగటిపూట షిఫ్ట్‌లతో పాటు వారంతాల్లోనూ విరామం లేకుండా పనిచేస్తున్నారని జూలీ పేర్కొన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద వీసా కార్యకలాపాలు నిర్వహించే దేశాల్లో అమెరికా ఒకటన్న ఆమె.భారతదేశం నుంచి విద్యార్ధులు, టెక్ కార్మికులు, శాశ్వతంగా యూఎస్ఏలో స్థిరపడేవారికి వీసాలు అందజేస్తున్నట్లు జూలీ తెలిపారు.గతేడాది అత్యధికంగా స్టూడెంట్ వీసాలు అందుకున్న రికార్డును భారతదేశం బద్ధలు కొట్టిందని ఆమె గుర్తుచేశారు.

ఈ ఏడాది మరోసారి అదే రీపిట్ అవుతుందని, అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్ధుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో స్థానంలో వుందని జూలీ పేర్కొన్నారు.

Telugu Covid, India, Indian, Visas, Embassy, Visa Wait Times-Telugu NRI

ఇదిలావుండగా.గతేడాది భారతీయ విద్యార్ధులకు అత్యధికంగా 1.25 లక్షల వీసాలను జారీ చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ ఈ ఏడాది ప్రారంభంలో మీడియాకు తెలిపారు.2016 తర్వాత ఈ స్థాయిలో భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి రావడం, ఆంక్షల్ని సడలిస్తూ వుండటంతో అమెరికాలో విద్యకు భారత్ సహా అన్ని దేశాల నుంచి డిమాండ్ మళ్లీ పెరిగిందని నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు.

కోవిడ్ నేపథ్యంలో సిబ్బంది కొరత , ఇతర కారణాల వల్ల వీసాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని.దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.ఏడాదిలోగా కోవిడ్ ముందు నాటి స్థితికి చేరుకుంటామని నెడ్‌ప్రైస్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube