టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు వేడుకలు ఒకింత గ్రాండ్ గా జరిగాయి.రామ్ చరణ్ అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకను పండుగలా జరుపుకోవడం గమనార్హం.
అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.చరణ్ గుర్రాలు అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ నాలుగో తరగతి నుంచి హార్స్ రైడింగ్ నేర్చుకున్నారని సమాచారం అందుతోంది.చరణ్ కు ఉపాసన ఒక గుర్రాన్ని బహుమతిగా ( horse as a gift )ఇచ్చారని ఉపాసన ఇచ్చిన బహుమతి చూసి చరణ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ పై ఉన్న ప్రేమను ఉపాసన ( upasana )ఈ విధంగా చాటుకున్నారు.అయితే ఈ విషయాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామ్ చరణ్ పుట్టినరోజున గేమ్ ఛేంజర్ సినిమా( game changer movie ) నుంచి విడుదలైన జరగండి జరగండి సాంగ్ అదరగొడుతోంది.యూట్యూబ్ లో ఈ సినిమా సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.రామ్ చరణ్ మూడో సినిమా, ఆరో సినిమా, తొమ్మిదో సినిమా, పన్నెండవ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోవడం గమనార్హం.
గేమ్ ఛేంజర్ 15వ సినిమా కాగా ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ సినిమా రికార్డులు తిరగరాసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఉపాసన ఫ్యాన్స్ సైతం రామ్ చరణ్ ను ఎంతగానో అభిమానిస్తుండటం గమనార్హం.