ఒక తల్లిగా ఆ బాధ నాకు తెలుసు.. సింగిల్ మదర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan ) భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలను చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలను నిర్వహిస్తోంది.

 Upasana Konidela Launched Apollo Childrens Hospital, Upasana, Apollo Childrens-TeluguStop.com

అంతే కాకుండా అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ తన గొప్ప మనసును చాటుకుంటోంది.ఉపాసన.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మంచి మంచి ఆరోగ్య సూత్రాలు చెబుతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన సింగిల్ మదర్స్ కు ఒక చక్కటి శుభవార్తను తెలిపారు.

Telugu Ram Charan, Tollywood, Upasana-Movie

తాజాగా అపోలో చిల్డ్రన్స్ బ్రాండ్‌ను సోమవారం ఉపాసన( Upasana ) లాంచ్ చేసింది.ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.అపోలో చిల్డ్రన్స్ లోగోను ఆవిష్కరించిన తరవాత ఉపాసన మాట్లాడుతూ.నేను గర్భం దాల్చిన తరవాత అందరూ నాపై ఎంతో ప్రేమను కురిపించారు.ఆశీస్సులు అందించారు.వారందరికీ కూడా నా ధన్యవాదాలు అని తెలిపింది.

నేను గర్భవతిని అయిన దగ్గర నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆ జర్నీలో నాకు ప్రోత్సాహం అందించిన అందరికీ ధన్యవాదాలు.మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు అందించినందుకు థాంక్యూ.

మా ప్రెగ్నెన్సీ జర్నీని ఎంతో అందంగా మార్చిన మీడియాకు థాంక్యూ.అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌( Apollo childrens hospital )ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.

Telugu Ram Charan, Tollywood, Upasana-Movie

నాకు ఇది చాలా ఎమోషనల్ జర్నీ.పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు.ఆ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం మా అందరి బాధ్యత.పిల్లలు, వారి తల్లిదండ్రుల మొహాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు.ఒక తల్లిగా నేను ఇప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నాను.గతంలో ఇతర తల్లుల మొహాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని.

కానీ ఇప్పుడు పిల్లలకు అనారోగ్యం వస్తే.ఆ తల్లిదండ్రులు ఎంతలా అల్లాడిపోతారో ఇప్పుడు నాకు తెలుస్తోంది.

నేను గర్భం దాల్చినప్పుడు నాకు ఎంతో మంది సలహాలు, సూచనలు ఇచ్చారు.ఎన్ని ఆశీస్సులు ఉన్నా బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కొంతమంది తల్లులు ఇబ్బంది పడడం నేను చూశాను.
కొంత మంది మహిళలు నా దగ్గరకు వచ్చి తమ బాధ చెప్పుకున్నారు.వాళ్లలో సింగిల్ మదర్స్ ఉన్నారు.వాళ్లకు సపోర్ట్ అవసరం.కాబట్టి, సీఎస్ఆర్ అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా ఈ ప్రకటన చేస్తున్నాను.

వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లి ఉచితంగా వైద్యం పొందవచ్చు.ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు, వారి పిల్లలకు లాభం చేకూరుతుందని నేను భావిస్తున్నాను.

నేను వాళ్లకు ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తాను.ఇదొక ఎమోషనల్ జర్నీ.

నేను ఫీల్ అయినట్టే ఆ తల్లులు కూడా ఫీలవ్వాలి అని ఉపాసన చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube