మనం పడుతున్న బాధల్లో, కష్టాల్లో నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కరూ మనకు అందరు సహాయం చేస్తారు.ప్రకృతి కూడా మనలో కలిసి పనిచేసి మనకు ఒక అవకాశం ఇస్తుంది.
ఎంత బాధ పడుతున్నా కూడా నిన్ను ప్రకృతి ప్రేమిస్తుంది.అలాగే నీ బాధ నుంచి నిన్ను బయటకు లాగుతుంది.
సరికొత్త జీవితాన్ని కూడా ఇస్తుంది.ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను ? ఎవరి గురించి చెబుతున్నాను అని ఒకసారి చూద్దాం.అతడు మరెవరో కాదు నటుడు సంపత్.అయన తెలుగు లో అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో చూస్తూనే ఉన్నాం.కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే సంపత్ జీ వితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి.
అసలు సంపత్ కి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
అతడు పని చేస్తున్నబిల్డింగ్ లో పై ఫ్లోర్లో ఆఫీస్ ఉంటే కింద ఫ్లోర్లో టీ స్టాల్ ఉండేది.ఓ రోజు చాయ్ తాగుదామని కిందకు వెళ్ళాడు.అక్కడ తన స్నేహితుని కలిశాడు.సంపత్ ని గుర్తుపట్టడానికి అతని స్నేహితుడికి చాలా సమయం పట్టింది.
ఎందుకంటే పహిల్వాన్ లా ఉండి ఒడ్డు, పొడుగు బాగా ఉండి విలన్ క్యారెక్టర్ లకు బాగా సూట్ అవుతాడు అని భావించిన సంపత్ ఈ రోజు బక్క చిక్కిపోయి కళ్ళల్లో జీవం లేకుండా.ఒక నిరాశవాదిలా, కూలిపోవడానికి రెడీగా ఉన్నా ఒక మర్రిచెట్టు లా ఉన్నాడు.

అతని చూడగానే ఆయన సినిమా కోసం వెతుకుతున్న ఒక క్యారెక్టర్ గుర్తొచ్చింది.నువ్వైతే సరిగ్గా సరిపోతావు సంపత్.ఈ ఆఫీస్ కి రా అంటూ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు.ఆ అడ్రస్ కు వెళ్లడం, అవకాశం దొరకడం, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ అవకాశాలు రావడం జరిగాయి.
ఇలా తీవ్రమైన కష్టాల్లో, నష్టాల్లో బాధల్లో ఉన్న సంపత్ కి ఒక్క అవకాశం వచ్చింది.అది ప్రకృతి ద్వారా.ఎవరు రమ్మన్నారు ఆ చోటికి ఆరోజు ఆ ఫ్రెండుని ? అతడు రావడం,, అవకాశం ఇవ్వడం, సంపత్ ని బ్రతికేలా చేయడం అంతా అలా చకచక జరిగిపోయాయి.అతని కష్టాల్లో నిజాయితీ ఉంది.
అతని జీవితంలో బాధ ఉంది.నిజంగా అతడు తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత బాగా కుంగిపోయాడు.
తన కూతుర్ని ఎలా సాకాలో తెలియక రాత్రి పగలు నిద్ర లేక ఇక రెండు మూడు నెలలు అయితే చచ్చిపోతానేమో అనే స్థాయికి కూడా బక్క చిక్కిపోయాడు.ఏది ఏమైనా ఈరోజు సంపత్ ఈ స్థాయిలో ఉండడానికి అతని కష్టాల్లో నిజాయితీ ఉండటమే కారణమని అందరూ అంటూ ఉంటారు.