తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా బదిలీలు జరుగుతున్నాయి.డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలను రద్దు చేయడం జరిగింది.
ఇదే సమయంలో భారీగా ప్రభుత్వ అధికారులను బదిలీలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.కాగా తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ( IPS )అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
* నిర్మల్ ఎస్పీగా జానకి షర్మిల * ఖమ్మం సీపీగా సునీల్ దత్ * సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్ * ట్రాన్స్కో ఎస్పీగా ఉదయ్కుమార్ రెడ్డి * మాదాపూర్ డీసీపీగా వినీత్ * ములుగు ఎస్పీగా శబరీష్ * టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీపీ, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ గా శ్రీనివాస్ రావు * కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్ * రాజేంద్రనగర్ డీసీపీగా CH.శ్రీనివాస్ * ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమారాజేశ్వరి * హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా వెంకటేశ్వర్లు * ఎల్బీనగర్ డీసీపీగా ప్రవీణ్ కుమార్ * సౌత్ ఈస్ట్ డీసీపీగా జానకి దారావత్ * మల్కాజిగిరి డీసీపీగా పద్మజ * జోగులాంబ డీఐజీగా జోయల్ డేవిస్ * రామగుండం సీపీగా చౌహాన్ * మెదక్ ఎస్పీగా బాలస్వామి * భూపాలపల్లి ఓఎస్టీగా అశోక్ కుమార్ * ఆదిలాబాద్ ఎస్పీగా గౌస్ ఆలమ్ * రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాసరావు * భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా రోహిత్ రాజు * సిద్దిపేట సీపీగా అనురాధ * మేడ్చల్ డీసీపీగా నికితా పంత్
.