ఏపి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబుపై ఏపి మంత్రి ఆర్.కే.
రోజా మండిపడ్డారు.ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో ఆర్.
కే.రోజా పాల్గోన్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ… నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూసిన అనంతరం ప్రజలంతా చీదరింపు చేసుకుంటున్నారన్నారు.వైసీపి ప్లీనరీని చూసిన తరువాత ఎవరైనా ఈ రాష్ట్రంలో ప్రజాభిమానం ఏ పార్టికి ఉంది అనేది అర్ధం అవుతుందని, ప్రజలంతా స్వచ్చందంగా వచ్చి వైసీపి ప్లీనరీలో ఏపి సీఎంను ఆశీర్వాదించారన్నారు.సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఆరోవ స్ధానం వచ్చిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
చంద్రబాబుకి చిన్న మెదడు చితికి పోయి మాట్లాడుతున్నారని, మూడు సంవత్సరాలు ఏపిలో సుపరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి మొదటి స్ధానంలో ఉన్నారని ఆమె చెప్పారు.
ఎప్పుడూ బోగస్ సర్వేలు చేసే చంద్రబాబుని ప్రజలంతా బోగస్ బాబు అని పిలుస్తున్నారని మండిపడ్డారు.
ఏపిలో టిడిపి అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలు భగవద్గీతగా, ఖురాన్, బైబిల్ గా చూసారని తెలియజేశారు.చంద్రబాబు రింగులో చిప్పు పెట్టుకోవడం కాదని, బుర్రలో చిప్పు ఉండాలి అనే చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు.
నారా లోకేష్ కి చిన్నతనం నుండే చిప్పు లేదని విమర్శించారు.బిజేపి ఓ గిరిజన మహిళకు అత్యున్నతమైన రాష్ట్రపతి స్ధానం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి సపోర్టు చేసినందుకు చంద్రబాబు ఏం మాట్లాడాడో అందరికి తెలుసు అన్నారు.
రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయారని, చంద్రబాబుని మానసిక అంగ వైకల్యం కేంద్రంలో చేర్చుతాంమని కొడాలి నాని అని చెప్పారని, అది త్వరలోనే జరుగుతుందని ఆర్.కే.రోజా ఆరోపించారు
.