సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ గా పరిచయం అయ్యాక పెద్ద హీరోల పక్కన హీరోయిన్ గా చాన్సులు వస్తున్న క్రమంలో డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సినిమాలో సన్నగా అందంగా కనిపించాలి కానీ ఒకసారి సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ నీ ఏర్పరుచుకున్న తర్వాత డైట్ అనేది ఎక్కువ మంది ఫాలో అవ్వరు ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవకాశాల కోసం క్యూట్ గా కనిపించడానికి జిమ్ డైట్ లు చేస్తూ ఉంటారు.కానీ నీ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అవడం వల్ల వాటినీ పట్టించుకోరు అలా పట్టించుకోకుండా మరి లావైపోయిన హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం…
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రక్షిత ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది.ఆ సినిమాలో ప్రకాష్ రాజు కూతురు గా నటించిన తన చక్కని అభినయంతో అచ్చం తెలుగమ్మాయిలా అనిపించింది.ఇడియట్ సినిమా గురించి మాట్లాడాలంటే ఆ సినిమాలో రక్షిత తండ్రి కమిషనర్ అయితే హీరో హీరోయిన్ తో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే మా నాన్న కమిషనర్ అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు హీరో కమిషనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయరా వాళ్లకి మొగుళ్ళు రారా అనే డైలాగు ఇప్పటికీ చాలా ఫేమస్, చాలా సినిమాల్లో కూడా డైలాగ్ ని వాడారు.
అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా లో హీరోయిన్ గా నటించిన రక్షిత తర్వాత మహేష్ బాబు హీరోగా నిజం సినిమా లో నాగార్జున హీరోగా చేసిన శివమణి సినిమా లో కూడా నటించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆంధ్రావాలా సినిమాలో కూడా రక్షిత నటించి మంచి మార్కులు కొట్టేసింది.సినిమా కమర్షియల్ గా ఆడినప్పటికీ మంచి క్యారెక్టర్ చేసినందుకు తనకి మంచి పేరు వచ్చింది.అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అందరివాడు సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశారు ఆ సినిమాలో తండ్రిగా నటించిన చిరంజీవి గోవిందరాజు పాత్ర కి సపోర్ట్ క్యారెక్టర్ గా చేసి జనాలందరిని అలరించింది.
ఆ తర్వాత తను కన్నడ దర్శకుడైన ప్రేమ్ నీ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయ్యారు.అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఫోటోలో రక్షిత చాలా లావుగా కనిపించింది.
దీంతో ఈవిడ ఇడియట్ సినిమాలో హీరోయిన్ రక్షిత నేనా అని జనాల్లో సందేహం మొదలైంది అయితే ఈ విషయం రక్షిత వరకు చేరుకోవడంతో తను స్పందిస్తూ నేను కావాలని లావు కాలేదు.పెళ్లయిన తర్వాత నాకు ఒక బాబు పుట్టాడు ఆ తర్వాత నాకు థైరాయిడ్ వచ్చింది దాంతో నా బాడీ ఇలా లావు అయింది అని చెప్పుకొచ్చింది.
అయినా స్లిమ్ గా ఉండడానికి ఇప్పుడు నేను హీరోయిన్ కాదు కదా అని అంటుంది.
సినిమాలో నటిస్తే స్లిమ్ గా ఉండాలి కానీ ప్రస్తుతానికి నేను సినిమాల్లో నటించడం లేదు కాబట్టి ఇలా ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు అని చెబుతుంది అయితే తను సినిమాల్లో మళ్లీ నటించడం లేదు కానీ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వాళ్ల బ్యానర్ నుంచి కొన్ని సినిమాలని కూడా కన్నడలో ప్రొడ్యూస్ చేశారు.రక్షిత వాళ్ళ నాన్న గౌరీ శంకర్ ఆయన కూడా కన్నడలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా వెలుగొందారు, వాళ్ళ అమ్మ మమత రావు కూడా హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది.అయితే ప్రస్తుతం ఉన్న రక్షిత ఫ్యాన్స్ మాత్రం ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన వాళ్లు ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తుంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రక్షిత మాత్రం లావుగా ఉండి సినిమాలు చేయకపోవడం వాళ్ళ కి ఎంత మాత్రం నచ్చడం లేదు.
వీలైతే స్లిమ్ గా అయ్యి మళ్లీ సినిమాల్లో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.చూద్దాం మరి రక్షిత అభిమానుల కోరిక మేరకు స్లిమ్ గా మారి మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేదో.