ఫస్ట్ మూవీ బంపర్ హిట్ అయినా.. రెండో మూవీకి చాలా గ్యాప్ తీసుకున్న దర్శకులు ఎవరో తెలుసా.?

తీసిన తొలి సినిమానే బిగ్గెస్ట్ హిట్ అయితే.ఆ దర్శకుడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి.

 Tollywood Directors Who Took Years To Release Second Movie-TeluguStop.com

వరుస సినిమాలతో బిజీ బిజగా ఉంటారు.కానీ కొందరు దర్శకులు మాత్రం తొలి సినిమా బ్లాక్ బస్టర్ సాధించినా.

రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు.సేమ్ ఇలాగే తన పంథా కొనసాగించాడు సందీప్ రెడ్డి వంగా.2017లో అర్జున్ రెడ్డితో సూపర్ హిట్ కొట్టిన ఈ యువ దర్శకుడు.సెకెండ్ సినిమాను అర్జున్ రెడ్డి తాతలాంటిది తీస్తానని చెప్పాడు.కానీ ఇంకా రెండో సినిమా ఫైనల్ కాలేదు.సేమ్ ఇలాగే.పలువురు దర్శకులు తమ తొలి.రెండో సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకున్నారు.ఇంతకీ రెండు సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న యంగ్ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 Tollywood Directors Who Took Years To Release Second Movie-ఫస్ట్ మూవీ బంపర్ హిట్… రెండో మూవీకి ఏళ్లకు ఏళ్ళు గ్యాప్ తీసుకున్న దర్శకులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీకాంత్ అడ్డాల

2008లో విడుదల అయిన కొత్త బంగారులోకం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్.తన రెండో సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013లో రిలీజ్ చేశాడు.రెండు సినిమాల మధ్య సుమారు 5 ఏండ్ల గ్యాప్ తీసుకున్నాడు.

శేఖర్ కమ్ముల

1999లో డాలర్ డ్రీమ్స్ సినిమా చేసిన శేఖర్ కమ్ముల సైతం తన రెండో మూవీ ఆనంద్ ను 2004లో రిలీజ్ చేశాడు.

పల్నాటి సూర్య ప్రతాప్

2009లో కరెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సూర్య ప్రతాప్.తన రెండో సినిమా కుమారి 21Fను 2015 విడుదల చేశాడు.

బీవీఎస్ రవి

2011లో వాంటెడ్ సినిమా చేసిన రవి.2017లో జవాన్ మూవీని తెరమీదకు తెచ్చాడు.

హరీష్ శంకర్

2006లో షాక్ సినిమా తీసిన హరీష్.2011లో మిరపకాయ్ తో జనాల ముందుకు వచ్చాయి.

విజయ భాస్కర్

1991లో ప్రధాన సినిమాను తీసిన విజయ భాస్కర్ 1999లో స్వయం వరంతో ముందుకు వచ్చాడు.

కిశోర్ కుమార్

కొంచె ఇష్టం.కొంచెం కష్టం సినిమాను 2009లో జనాల ముందుకు తీసుకొచ్చిన కిశోర్.2013లో తఢాఖా సినిమా చేశాడు.

దేవా కట్ట

2005లో వెన్నెల తీసిన ఈ దర్శకుడు 2010లో ప్రస్థానం మూవీ చేశాడు.

ప్రకాశ్ కోవెలమూడి

2004లో బొమ్మలాట ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన ఈ దర్శకుడు 2011లో అనగనగా ఒక ధీరుడు సినిమా చేశాడు.

#SrikanthAddala #HarishShankar #DirectorsFirst

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు