శివ’ సినిమా నుండి ‘వైల్డ్ డాగ్’ వరకు నాగార్జున పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..

ఇండస్ట్రీలో కొత్త దర్శకులు పరిచయం అవ్వాలంటే హీరోలదే పైచేయి.హీరో కథ ఓకే చేస్తేనే ఏ దర్శకుడైనా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేది.

 Tollywood Director Who Are Introduced By Hero Nagarjuna, Nagarjuna, Geethakrishn-TeluguStop.com

అలా ఎంతోమంది డైరెక్టర్లని మన హీరోలు టాలీవుడ్ కి పరిచయం చేశారు.అలా కొత్త టాలెంట్ ను పరిచయం చేసిన వారిలో నాగార్జున ఒకరు.

ఈయన టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ మూవీతో రామ్ గోపాల్ వర్మ నుంచి వైల్డ్ డాగ్ మూవీతో అశిషోర్ సాల్మన్ వరకూ అనేకమంది డైరెక్టర్లను పరిచయం చేశారు.

సంకీర్తన మూవీతో గీతాకృష్ణ అనే కొత్త టాలెంట్ ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఆ తర్వాత శివ మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పరిచయం చేశారు.ఈ సినిమాతో తెలుగులో వర్మని పరిచయం చేసిన నాగ్, శివ రీమేక్ తో బాలీవుడ్ లో కూడా వర్మని డైరెక్టర్ గా పరిచయం చేశారు.

జైత్రయాత్ర సినిమాతో ఉప్పలపాటి నారాయణరావును పరిచయం చేయగా, రచ్చకన్ అనే తమిళ మూవీతో ప్రవీణ్ గాంధీ అనే కొత్త వ్యక్తిని కోలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం చేశారు.అయితే ఈ సినిమా తెలుగులో రక్షకుడు పేరుతో రిలీజైంది.

నిర్ణయం సినిమాతో మలయాళ దర్శకుడు ప్రియ దర్శన్ ను, కిల్లర్ మూవీతో ఫాజిల్ అనే దర్శకుడ్ని, శాంతి క్రాంతి సినిమాతో వి.రవిచంద్రన్, చైతన్య మూవీతో ప్రతాప్ పోతన్ ను పరిచయం చేశారు.బాలీవుడ్ ని శాసిస్తున్న మహేహ్ భట్ ను సైతం టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత నాగార్జునదే.ఈయన క్రిమినల్ సినిమాకి దర్శకత్వం వహించారు.ఇక నాగ్ నిర్మాతగా “శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి” సినిమాతో దర్శకుడు వైవియస్ చౌదరిని పరిచయం చేశారు.ఆ తర్వాత ఇదే దర్శకుడితో సీతారామరాజు సినిమా తీశారు.

ఈ సినిమాకి నాగార్జున హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు.

Telugu Geethakrishna, Naga Koteswarao, Nagarjuna, Raghava Larence, Saalman, Yvs

నువ్వు వస్తావని సినిమాతో వంకినేని రత్న ప్రతాప్, నిన్నే ప్రేమిస్తా సినిమాతో ఆర్.ఆర్.షిండే వంటి కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేశారు.అయితే దురదృష్టవశాత్తు ఈ ఇద్దరూ ఇప్పుడు లేరు.

ఎదురులేని మనిషి సినిమాతో జొన్నలగడ్డ శ్రీనివాసరావును దర్శకుడిగా పరిచయం చేయగా, సంతోషం సినిమాతో దశరథ్ ను పరిచయం చేశారు.అగ్ని వర్ష సినిమాతో అర్జున్ సజ్నని అనే డైరెక్టర్ ని బాలీవుడ్ కి పరిచయం చేశారు.

మాస్ మూవీతో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత నాగ్ దే.ఇప్పుడు లారెన్స్ తనదైన శైలిలో హారర్ చిత్రాలతో భయపెడుతూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు.కేడీ మూవీతో కిరణ్ అనే డైరెక్టర్ ను, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణ అనే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ను టాలీవుడ్ కి పరిచయం చేశారు.ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో నాగ కోటేశ్వరరావు అనే దర్శకుడ్ని పరిచయం చేశారు.

ఈ మూవీలో నాగార్జున నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.తాజాగా వైల్డ్ డాగ్ మూవీతో అశిషోర్ సాల్మన్ అనే కొత్త దర్శకుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

ఇలా నాగార్జున తన కెరీర్ లో చాలా మంది డైరెక్టర్లను పరిచయం చేశారు.వారిలో కొంతమంది ఇప్పటికీ తమ సత్తా చాటుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube