ఇక్కడ టన్నుల కొద్దీ కిక్.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే రియాల్టీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే నాలుగు సీజన్లలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరి కొన్ని గంటలలో ఐదవ సీజన్ ప్రారంభించబోతుంది.

 Tollywood Bigg Boss Show Season 5 Latest Promo Viral,  Bigg Boss5, Latest Promo,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేయగా ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా ఐదు రెట్లు రచ్చ, ఎంటర్టైన్మెంట్, ఐదురెట్లు ఎనర్జీ ఉంటుందని, ఈ సీజన్లో కిక్ టన్నులకొద్దీ ఉంటుందని చెబుతూ ప్రోమోను విడుదల చేయడంతో ఈ కార్యక్రమం పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ను బయట నుంచి చూపించడంతో ప్రేక్షకులు ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.కేవలం కొన్ని గంటలలో ఈ కార్యక్రమం ప్రసారం కావడంతో ప్రేక్షకులలో ఎంతో ఉత్కంఠత నెలకొంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైనలిస్టు సోషల్ మీడియాలో కొందరు పేర్లు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ యాంకర్ రవి, వర్షిని,యాక్ట‌ర్ ప్రియ, వ‌ర్ధ‌మాన న‌టి ల‌హ‌రి షారి, సెవెన్ ఆర్ట్స్ సరయు దీపక్ సరోజ్ , వర్థమాన నటి శ్వేతా వర్మ ,షణ్ముఖ్ జస్వంత్ ,నటరాజ్ మాస్టర్ , టెలివిజన్ యాక్టర్ సన్నీ ,మానస్ షా , టెలివిజన్ నటి ఉమాదేవి, మోడల్ జస్వంత్, ఆర్జే కాజల్ యూట్యూబర్ లోబో, లహరి, సిరి హ‌న్మంతు, సింగ‌ర్ రామ‌చంద్ర ,జ‌బ‌ర్ధ‌స్త్ ప్రియాంక పేర్లు వినపడుతున్నాయి.అయితే వీరిలో ఎవరు ఉంటారు లేదు అనే విషయం మరి కొన్ని గంటలలో తెలియనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube