వైరల్ వీడియో: సుబ్బయ్య హొటలా మజాకా.. హైదరాబాద్లోని సుబ్బయ్య హోటల్ ముందు బారులుతీరిన జనం..

సుబ్బయ్య హోటల్ పేరు వింటే చాలు నోరూరుతుంది.ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ హోటల్ చరిత్ర నిన్నామొన్నటిది కాదు.

 This Queue For Meals Kakinada Subbaiah Gari Hotel At Kukatpalli-TeluguStop.com

అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హోటల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.ఇటీవల హైదరాబాద్లో వెలిసిన సుబ్బయ్య గారి హోటల్ ముందు బారులు తీరిన జనాన్ని చూస్తే చాలు అక్కడి భోజనం ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పేయొచ్చు.

హైదరాబాద్లోని ప్యారడైజ్,బావర్చీ ఇలా అన్ని దిగదుడుపే ఈ లైన్ ముందు.ఆ హోటల్ గురించి కొన్న ఆసక్తికరమైన విషయాలు.

నెల్లూరు జిల్లా నుంచి కాకినాడకు వలస వచ్చిన గునుపూడి సుబ్బారావు 1950లో 10 మందితో కలసి చిన్న మెస్ ఏర్పాటు చేశారు.అప్పట్లో ప్లేటు భోజనం కేవలం 50 పైసలే.సుబ్బయ్య వంటకాలకు ఆధరణ లభించడంతో 1955లో కాకినాడ నడిబొడ్డున సుబ్బయ్యగారి హోటల్‌ను ప్రారంభించారు.ఇప్పుడీ హోటల్ ఉభయ గోదావరి జిల్లా్ల్లోనే ఫేమస్ శాఖాహార హోటల్‌గా పేరొందింది.ఒకప్పుడు ఈ హోటల్‌ను శ్రీ కృష్ణ విలాస్‌గా పిలిచేవారు.అయితే, హోటల్ కంటే.

వ్యక్తిగా వినియోగదారులకు దగ్గరైన సుబ్బయ్య పేరుతోనే అంతా ‘సుబ్బయ్య హోటల్’ అని పిలవడం మొదలుపెట్టడంతో చివరికి అదే పేరుతో హోటల్ పాపులర్ అయ్యింది.ఈ హోటల్ ఇప్పుడు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, రోడ్ నెం.4లో ప్రారంభం అయింది.మొదట్లో కర్రీ పాయింట్, క్యాటరింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

పదిహేను రోజుల తర్వాత హోటల్ ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు హోటల్ ముందు నిల్చున్న క్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది.అది చూసిన నెటిజన్లు సుబ్బయ్య హోటలా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నోట్లరద్దు అప్పుడు ఎటిఎంల ముందు నిల్చున్న క్యూలైన్ ని తలపిస్తుంది ఇప్పుడు ఈ హోటల్ ముందు క్యూలైన్.

మరింకెందుకు ఆలస్యం కుకట్ పల్లి వైపు వెళ్తే మీరు కూడా ఓ పట్టపట్టండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube