భారీ అంచనాల నడుమ గత 12 రోజుల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) కి మొదటి ఎపిసోడ్ నుండే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో వస్తున్న టీఆర్ఫీ రేటింగ్స్ డబుల్ ఉన్నాయి.
ఈ సీజన్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ కి దాదాపుగా 18 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు.
ఇక వీక్ డేస్ లో కూడా ఈ సీజన్ కి వస్తున్న రేటింగ్స్ ముందు సీజన్స్ తో పోలిస్తే డబుల్ ఉన్నాయి.కంటెస్టెంట్స్ అందరూ మొదటి ఎపిసోడ్ నుండే కావాల్సినంత కంటెంట్ ఇవ్వడం తో పాటుగా, టాస్కులు కూడా చాలా తొందరగా అర్థం చేసుకొని, అద్భుతంగా ఆడడం వల్లే ఇంత రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ ఎంత వాడావేడి వాతావరణం లో జరిగిందో అందరూ చూసారు.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి ప్రిన్స్ యావర్, షకీలా, అమర్ దీప్, రతికా, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ , శోభా శెట్టి , శివాజీ మరియు గౌతమ్ నామినేట్ అయ్యారు.వీరిలో అందరికంటే తక్కువ ఓట్లు నమోదు చేసుకున్న కంటెస్టెంట్ గా షకీలా( Shakila ) నిల్చింది అట.రేపు ఈమె ఎలిమినేట్ అవ్వబోతుంది.అయితే మరో ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ప్రిన్స్ యావర్ కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నారు అట.కానీ శాశ్వతంగా ఇంటి నుండి మాత్రం కాదు, అతనిని ఒక సీక్రెట్ రూమ్ లోకి పంపబోతున్నట్టు టాక్.గడిచిన రెండు సీజన్స్ లో సీక్రెట్ రూమ్, వైల్డ్ కార్డు( Secret room, wild card ) ఎంట్రీ వంటి కాన్సెప్ట్స్ లేవు, కానీ ఈ సీజన్ లో మాత్రం రెండు ఉన్నాయి.ఈరోజు ప్రిన్స్ యావర్( Prince Yavar ) ని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ప్రేక్షకులను నమ్మించి సీక్రెట్ రూమ్ లోకి పంపుతారట.
ప్రిన్స్ యావర్ ఈ వారం మొత్తం అద్భుతంగా ఆడాడు అనే విషయం ఇంట్లో కంటెస్టెంట్స్ తో పాటుగా ఈ షో ని చూస్తున్న కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు.అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అంటే ఇంటి సభ్యుల రియాక్షన్స్ ఎలా ఉంటాయో మనం చూడొచ్చు.అలాగే రతికా( Ratika ) ఇప్పుడు ప్రిన్స్ యావర్ తో పులిహోర కలుపుతుంది.అతని మీద నిజమైన అభిప్రాయం ఏమిటి అనేది అతను ఎలిమినేట్ అయిపోయాడు అని ఆమె నమ్మినప్పుడు తెలుస్తుంది.
సీక్రెట్ రూమ్ లో నుండి చూసే యావర్ కి రతికా తన పట్ల నిజమైన ప్రేమ చూపిస్తుందా, లేదా నటిస్తుందా అనే విషయం తెలుస్తుంది.ఈ సీక్రెట్ రూమ్ తో పాటుగా, వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లోనే ఉండబోతున్నట్టు సమాచారం, ఇక నుండి బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది.