మామూలుగా వెండితెరపై ఎన్ని రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అటువంటి వాటిలో స్పై సినిమాలకు( Spy Movies ) దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది.
స్పై నేపథ్యంలో ఎలాంటి కథలు ఎలాంటి సినిమాలు వచ్చినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం ఖాయం అనే చెప్పాలి.ఇప్పటికే ఈ స్పై కథ నేపథ్యంలో ఎన్నో రకాల సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా థ్రిల్లింగ్ కథలతోనే ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు పలువురు కథానాయకులు సిద్ధమవుతున్నారు.మరి తెరపై గూఢచారులు, ఏజెంట్లుగా సందడి చేయనున్న ఆ తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్.( NTR )
ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.అయితే త్వరలోనే తన తొలి బాలీవుడ్ చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు.అదే వార్ 2.( War 2 ) యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రమిది.దీంట్లో బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్‌తో పాటు తారక్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఎన్టీఆర్ భారత రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.అంతేకాదు యశ్ స్పై యూనివర్స్‌లో ఈ పాత్ర తరచూ సందడి చేయనుందని, పూర్తిగా ఆ పాత్ర నేపథ్యంలోనే సోలోగా ఒక సినిమా కూడా పట్టాలెక్కనుందని తెలిసింది.
వచ్చే నెలాఖరు నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతమందించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.ప్రస్తుతం ఫ్యామిలీస్టార్ గా సినీ ప్రియుల్ని పలకరించేందుకు బాక్సాఫీస్ బరిలో సిద్ధంగా ఉన్నారు విజయ్ దేవరకొండ.( Vijay Devarakonda ) ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 5న థియేటర్లలోకి రానుంది.
దీని తర్వాత విజయ్.దర్శకుడు గౌతమ్ తిన్ననూరి( Director Gowtam Tinnanuri ) సినిమాని పునఃప్రారంభించనున్నారు.
ఇదీ ఓ ఆసక్తికర స్పై థ్రిల్లర్ కథాంశంతోనే ముస్తాబవుతోంది.ఈ సినిమాలోని తన పాత్ర కోసం విజయ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇటీవల కాలంలో తెలుగులో గూఢచర్య నేపథ్య కథలకు మంచి ఊపు తీసుకొచ్చిన చిత్రాల్లో గూఢచారి ముందు వరుసలో ఉంటుంది.
ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ చిత్రంలో అర్జున్ కుమార్ అలియాస్ ఏజెంట్ గోపీ 116గా అడివి శేష్ చేసిన సాహసాలు సినీప్రియుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.అందుకే ఇప్పుడదే పాత్రతో మరోసారి మురిపించేందుకు ‘గూఢచారి 2’తో( Goodachari 2 ) సిద్ధమవుతున్నారు శేష్.అయితే తొలి భాగంలో కథంతా మన దేశం లోపల జరిగే ఆపరేషన్ చుట్టూ తిరగ్గా.ఈ రెండో భాగంలో దేశం వెలుపల జరిగే ఓ సీక్రెట్ మిషన్ నేపథ్యంలో కథ సాగనుంది.
అంతేకాదు దీంట్లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారు.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ పాన్ ఇండియా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో నిఖిల్ చేయనున్న చిత్రాల్లో ది ఇండియా హౌస్( The India House ) కూడా ఒకటి.కథానాయకుడు రామ్‌చరణ్ సమర్పిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నారు.
భారతీయ చరిత్రలో మరచిపోయిన అధ్యాయంగా మిగిలిపోయిన ఓ ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు.
ఇదీ గూఢచర్య నేపథ్యమున్న కథాంశమే అని సమాచారం.దీంట్లో దేశభక్తి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలిసింది.స్వాతంత్య్రానికి పూర్వం లండన్‌లో జరిగే చిత్రంగా ఉంటుంది.
ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న స్వయంభ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.ఓవైపు వెండితెరపై సినిమాలతో సందడి చేస్తూనే.
మరోవైపు ఓటీటీ వేదికగా వెబ్‌సిరీస్‌లతోనూ జోరు చూపిస్తోంది సమంత. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్: హనీ బన్నీ( Citadel: Honey Bunny ) సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.దీంట్లో వరుణ్ ధావన్ కథానాయకుడు.ఇదీ ఓ సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతోనే రూపొందింది.దీంట్లో సామ్ – వరుణ్ స్పై ఏజెంట్స్‌గా వీరోచిత పోరాటాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.ఈ సిరీస్ కోసం సమంత డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.