ఆర్టీసీ ఎండికి దృష్టికి బీబీనగర్ ప్రజల బాధలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్( Bibinagar ) పట్టణం రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో ఈ పరిసర ప్రాంతాల నుండి నిత్యం వందలాది మంది హైదరాబాద్,ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ బస్సులు అగకపోవడం వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నారని బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన మారం సమరసింహారెడ్డి బస్టాండ్ లో ప్రయాణికుల బాధలను ఫోటో తీసి టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కి సోషల్ మీడియా(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ లో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న బీబీనగర్ పట్టణంలో కేవలం యాదగిరిగుట్ట డిపో బస్సులు మాత్రమే ఆగుతున్నాయని, హన్మకొండ,వరంగల్ మరియు జనగాం డిపో బస్సులు ఆగకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 The Sufferings Of The People Of Bibinagar Are Brought To The Attention Of The Rt-TeluguStop.com

గుట్ట డిపోకి చెందిన బస్సులు కూడా అప్పుడప్పుడు మాత్రమే వస్తుండటంతో ప్రతిరోజూ పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళే వారు,ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్ళే ప్రజలు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు సకాలంలో వెళ్ళలేక నానా యాతన పడుతున్నారని తెలిపారు.ఈ ట్వీట్ కు స్పందించిన సజ్జానార్( Sajjanar ) మరియు టిఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల బస్సులు బీబీనగర్ పట్టణంలో ఆగేలా చూడాలని హన్మకొండ, వరంగల్ డిపో మేనేజర్లకు ఆదేశాలివ్వటం జరిగిందని చెప్పారు.

దీనితో నిత్యం ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్న బీబీనగర్ ప్రజలకు మేలు కలుగుతుందని,ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube