అప్పగింతల సమయంలో ఏడ్చేసిన వరుడు..!

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ, రకరకాల వీడియోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.వీటిలో కొన్నింటిని చూసి నవ్వుకుంటే కొన్నింటిని చూసి ఉద్వేగానికి గురవుతాం.

 The Groom Who Cried During The Handover , Bride , Groom , Viral News , Viral V-TeluguStop.com

ఇంకొన్ని ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయా అంటూ ఆశ్చర్యపోయేలా ఉంటాయి.అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వీడియోలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

ఈ వీడియోలో జరిగిన విచిత్రం ఏమంటే, వధువుకు బదులుగా వరుడు తీవ్రంగా ఏడుస్తూ కనిపించడం.అవును.

అక్కడ వరుడు అకస్మాత్తుగా ఎడ్వడంతో అందరు అవాక్కయ్యారు.

వైరల్ గా మారిన ఈ వీడియోలో ఇంతకీ ఏముందంటే, పెళ్లి వేడుక ముసిగిన తరువాత పెళ్లికూతురు వీడ్కోలు చెప్పే సమయంలో పెళ్లి కూతురుకి బదులు వరుడు హఠాత్తుగా కెమెరా వైపు చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు.

ఇది చూసిన వధువు, అక్కడున్నవారు మొదట షాక్ తిన్నారు.తరువాత అసలు విషయం తెలుసుకొని గట్టిగ నవ్వడం మొదలు పెట్టారు.ఇంతకీ ఆ మహానుభావుడు నిజంగా ఏడవలేదు.ఏడుస్తున్నట్లు నటించడం మొదలు పెట్టాడు.

అయితే పెళ్లికొడుకు కావాలనే ఇలా చేస్తున్నాడని అర్ధమయిన తర్వాత వధువు నవ్వుతుంది.వరుడి చేసిన పనికి పెళ్ళికి వచ్చిన బంధువుల ముఖాల్లోనూ చిరునవ్వు వెల్లివిరిసింది.

ఇక దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయడం వలన పెళ్లి వేడుకలో నాటకం గరిష్ట స్థాయికి చేరుకుంది.ఈ వీడియోలో వరుడు సరిగ్గా అదే చేస్తున్నాడంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ.వరుడు కాస్త ఎక్కువ చేసాడు అని, ఓవర్ యాక్టింగ్ చేసినా గుర్తుండిపోతుంది అని కొందరంటే.ఏ వరుడైనా పెళ్లి తర్వాత తన భవిష్యత్తు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.ఇక్కడ కూడా అబ్బాయి అలాంటిదే చేస్తున్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube