రెండోసారి సీఎం అయిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం..!!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు మరికొంతమంది కేంద్ర మంత్రులు… బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు.

 The Decision Taken By Yogi Adityanath As Soon As He Became The Cm For The Second-TeluguStop.com

తనతోపాటు క్యాబినెట్ మంత్రులతో 52 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ క్రమంలో రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ నిన్న రెండు గంటల వరకు క్యాబినెట్ భేటీ నిర్వహించారు.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి నిర్ణయం గా ఉచిత రేషన్ బియ్యం పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో మూడు నెలల్లో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.జూన్ 30వ తారీకు వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 15 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు.మామూలుగా అయితే ఈ పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ పథకాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ యూపీ బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube