తెలంగాణ బిజెపి అభ్యర్థుల జాబితా దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.మరి కొద్ది రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బిజెపి ఏర్పాట్లు చేసుకుంటుంది.
ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో బిజెపి కాంగ్రెస్ లు ఈ విషయంలో కంగారు పడుతున్నాయి.గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు ప్రకటించేందుకు బిజెపి సిద్ధం అవుతోంది .అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కీలక నాయకులంతా సిద్ధంగా ఉన్నారు.ఇక హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సతీమణి జమునను( Etela Jamuna ) ఎన్నికల్లో పోటీకి దింపే ఆలోచనతోనే టికెట్ కోసం అధిష్టానం చేసి సక్సెస్ అయినట్లు సమాచారం.
ఈ మేరకు ఆమెకు మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.మేడ్చల్ నియోజకవర్గంలో ఈటెల కుటుంబానికి విస్తృతంగా పరిచయాలు ఉండడం తో రాజేందర్ భార్య జమునను మేడ్చల్ నుంచి పోటీకి దించితేనే మంచిదనే ఆలోచనతో అధిష్టానం కూడా ఉందట.
ఈటల రాజేందర్ కు మేడ్చల్ మండల( Medchal Mandal ) పరిధిలోని పూడూర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నివాసం ఉంది. ఆయన గోదాములు , గతంలో పౌల్ట్రీలు ఇతర వ్యాపారాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండడంతో, వారికి మేడ్చల్ నియోజకవర్గంలో సత్సంబంధాలు ఉన్నాయి .ఇక రాజేందర్ భార్య జమున నివాసం పూడూర్ పరిధిలో ఉండడంతో స్థానిక నాయకులతో పరిచయాలు ఉన్నాయి .
ఈటెల కుటుంబం ఆర్థికంగా నూ బలంగా ఉండడంతో, టిక్కెట్ ఆశిస్తున్న వారికి ఆ స్థాయిలో బలం లేకపోవడం, రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినా( Etela Rajendar ), ఆయన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజిక వర్గం పెత్తనం మేడ్చల్ లో ఎక్కువగా ఉండడంతో, ఆమె అభ్యర్థిత్వం బాగా కలిసి వస్తుందని బిజెపి అధిష్టానం అంచనా వేస్తోందట. దీంతో ఈటెల రాజేందర్ భార్య జమునకే మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం.బీఆర్ఎస్ , కాంగ్రెస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కోవాలి అంటే జమున వల్లే సాధ్యం అవుతుందనే అంచనాకు బీజేపీ వచ్చిందట.