ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ మీకు గుర్తుందా ..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన “ధర్మ చక్రం” అనే చిత్రంలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటించిన తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన కన్నడ హీరోయిన్ “ప్రేమ” తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.ఒకప్పుడు ప్రేమ లవ్ అండ్ ఎమోషనల్ మరియు పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

 Prema, Telugu Veteran Heroine, Real Life News, Tollywood, Devi Movie Heroine New-TeluguStop.com

కాగా తెలుగులో ప్రేమ నటించిన రాయలసీమ రామన్న చౌదరి, దేవీ పుత్రుడు, ప్రేమతో రా, చిరునవ్వుతో, అమ్మ ఒకటో తారీకు, నువ్వే కావాలి, దేవి, తదితర చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే అప్పుడప్పుడు తెలుగులో అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రేమకి ఆమె మాతృభాష అయినటువంటి కన్నడలో ఎక్కువ సినిమా అవకాశాలు రావడంతో కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది.కానీ ఈ మధ్య  వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

 అయితే ప్రస్తుతం నటి ప్రేమ దుబాయ్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

పెళ్లయిన తర్వాత కూడా అడపాదడపా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించిన  ప్రేమ 2017 సంవత్సరం నుంచి కొంత మేర సినిమా పరిశ్రమకు ఎందుకో దూరంగా ఉంటోంది.

అలాగే ఆ మధ్య ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్లీ చిత్రాల్లో నటిస్తానని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube