సుడిగాలి సుధీర్ బుల్లితెరపై సంచలనాలను సృష్టించిన అతికొద్ది మంది ప్రముఖ కమెడియన్లలో ఒకరనే సంగతి తెలిసిందే.నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే జబర్దస్త్ అని సుధీర్ కామెంట్లు చేశారు.
నాకు అన్ని ఛానెల్స్ ఇంపార్టెంట్ అని సుధీర్ అన్నారు.ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం నాకు ముఖ్యమని సుధీర్ పేర్కొన్నారు.
ఫ్యాన్స్ ఎక్కువగా రష్మీతో లవ్ ట్రాక్ నిజమేనా అని అడిగేవారని సుధీర్ వెల్లడించారు.
ఇంతమంది అభిమానుల సపోర్ట్ పొందడం సంతోషం కలిగిస్తోందని సుధీర్ అన్నారు.
పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదని నన్ను ఎలాంటి క్వాలిటీస్ కావాలని అడిగినా వేస్ట్ అని సుధీర్ పేర్కొన్నారు.ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని సుధీర్ చెప్పుకొచ్చారు.
ఒకవేళ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తే కూల్ గా ఉండే నన్ను అర్థం చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి భార్యగా రావాలని సుధీర్ చెప్పుకొచ్చారు.
బ్రేకప్ అనేది లైఫ్ లో సక్సెస్ కావడానికి మంచి ఛాన్స్ అని నమ్ముతానని సుధీర్ కామెంట్లు చేశారు.
గాలోడు మూవీ ఫస్ట్ కాపీ ఇంకా చూడలేదని ఆయన పేర్కొన్నారు.సినిమా రిజల్ట్ ను జనాలు డిసైడ్ చేస్తారని ఆయన కామెంట్లు చేశారు.ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని ఆయన తెలిపారు.రియల్ లైఫ్ లో నేను ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటానని ఆయన కామెంట్లు చేశారు.
నన్ను పలకరించని ఏజ్ గ్రూప్ ఉండరని సుధీర్ అన్నారు.ఇతర భాషల ప్రేక్షకులు కూడా నా షోలు చూస్తారని తెలిసి సుధీర్ పేర్కొన్నారు. ఢీ షో వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా పాపులారిటీ దక్కిందని సుధీర్ వెల్లడించారు.రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చానని సుధీర్ పేర్కొన్నారు.