ప్రతీ వారం ఓటిటి ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తూ ఓటిటి ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
ఇక ఈ వారం కూడా పలు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.ఈసారి బడా సినిమాలు రెండు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అందులో ఒకటి బాలీవుడ్ సినిమా అయితే మరొకటి కోలీవుడ్ సినిమా.కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్.
మరి మరో సినిమా బ్రహ్మాస్త్ర.ఈ రెండు సినిమాలు ఓటిటి లోకి ఒకేసారి వచ్చాయి.
అయితే థియేటర్స్ లో ఈ రెండు సినిమాలు డిఫెరెంట్ రెస్పాన్స్ అందుకున్నాయి.బ్రహ్మాస్త్ర ప్లాప్ గా నిలిచిపోతే.
పొన్నియన్ సెల్వన్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు ఓటిటిలో మాత్రం రివర్స్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
పొన్నియన్ సెల్వన్ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు.ఈ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో బాగానే సందడి చేసింది.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
మిగతా భాషల్లో పర్వాలేదు అనిపించుకుంది.
ఇక బ్రహ్మాస్త్ర బాలీవుడ్ నుండి పెద్ద సినిమాగా రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 200 కోట్ల వరకు వసూళ్లు చేసిన ఇది 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్లాప్ గా మిగిలి పోయింది.అయితే ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అయినా ఈ రెండు సినిమాల్లో బ్రహ్మాస్త్ర మంచి స్పందన తెచ్చుకుంది.
థియేటర్స్ లో మిస్ అయిన వారంతా ఓటిటి లలో చూస్తున్నారు.తెలుగు ఆడియెన్స్ బాగా చూస్తున్నట్టు తెలుస్తుంది.ఇక పొన్నియన్ సెల్వన్ ను చూసేందుకు మాత్రం ఆడియెన్స్ అంతగా ఆసక్తి చూపించక పోవడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.