దేశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఒకపక్క రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” యాత్రకి ప్రజలనుండి అపూర్వమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో రాహుల్ ఇస్తున్న హామీలు ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం కలిగేలా చేస్తున్నాయి.ఇదిలా ఉంటే త్వరలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తొలి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలో లక్ష ఉద్యోగాల సృష్టికి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ రీతిగా ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత ఫించన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని.హార్ ఘర్ లక్ష్మీ యోజన కింద ప్రతి మహిళకు నెలకు ₹1500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటన చేశారు.







