ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లు రాజీవ్ సేన్, చారు అసోపా.గత మూడు, నాలుగు రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
మొదట చారు అసోపా తన భర్త రాజీవ్ తనని చిత్రహింసలు పెట్టాడని ఘోరంగా హింసించాడు అని మీడియా ముందు చెబుతూ ఎమోషనల్ అయిన విషయం మనందరికీ తెలుస్తుంది.ఆ వాఖ్యలపై స్పందించిన రాజీవ్ తప్పు మొత్తం చారు వైపు పెట్టుకొని తనను నిందిస్తోంది అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
తప్పు నువ్వు చేసావంటే నువ్వు చేసావు అంటూ ఒకరు నిందించుకుంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
ఇంటర్వ్యూ లో చారు మాట్లాడిన మాటలు వేసిన నిందలపై స్పందించిన రాజీవ్ సహ నటుడు కరణ్ మెహ్రాతో రొమాంటిక్ రీల్ చేసింది నిజం కాదా? అని భార్యను మీడియా ముఖంగా నిలదీశాడు.కాగా తాజాగా ఈ వ్యవహారం పై నటుడు కరణ్ మెహ్ర స్పందించాడు.ఈ సందర్భంగా కరణ్ మెహ్ర మాట్లాడుతూ నీ భార్యతో రొమాన్సా?అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా రాజీవ్.నేను చారు ని పదేళ్ల క్రితం ఒకసారి కలిసాను.ఆ తర్వాత ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయాను.
ఆ తర్వాత మళ్లీ అప్పుడెప్పుడో జూన్ లో ప్రమోషనల్ ఈవెంట్ కోసం తనతో మాట్లాడాను అదే చివరిసారి.
మేము చివరిసారిగా అప్పుడే మాట్లాడుకుందాం ఆ తర్వాత మాట్లాడుకోలేదు.కానీ నువ్వు మాత్రం ఇలా నాపై చెత్త ఆరోపణలు చేయడం దారుణం.రాజీవ్ పై పరువునష్టం దావా వేస్తాను అని చెప్పుకొచ్చాడు కరణ్ మెహ్ర.
మరి ఈ వ్యాఖ్యలపై రాజీవ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఇకపోతే రాజీవ్, చారు లది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ జంటకి ఇప్పుడు 11 నెలల పాప కూడా ఉంది.అయితే రాజీవ్ తో ఆ పాప కోసం కలిసి ఉండాలనుకున్న చారు ఇప్పుడు రాజీవ్ ప్రవర్తన తో విసిగిపోయారని విడాకులు కావాలి అంటూ మీడియా ముందు కంటతడి పెట్టింది.