పుల్లయ్య కి మెచ్యూరిటీ లేదంటున్న రాకేష్ మాస్టర్ కానీ....

ఒకప్పుడు పలు టాలీవుడ్ లో చిత్రాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్  రాకేష్ మాస్టర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏమైందో ఏమో కానీ గత కొన్ని ఏళ్లుగా తన వ్యక్తిగత కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి రాకేష్ మాస్టర్ ఈ మధ్య ఇంటర్వ్యూలలో చేసేటువంటి వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

 Telugu Senior Dance Choreographer Rakesh Master Sensational Comments On Pullaya,-TeluguStop.com

కాగా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది డాన్సర్స్ కి రాకేష్ మాస్టర్ శిక్షణ ఇచ్చాడు.

అయితే ఇటీవలే తన అభిమానిని చెప్పడంతో రాకేష్ మాస్టర్ కర్నూలు జిల్లాకు చెందిన పుల్లయ్య అనే అభిమానిని సినిమా హీరోని చేస్తానని హైదరాబాద్ కి తీసుకు వచ్చి అతడికి సినిమా హీరో అవ్వడానికి కావలసినటువంటి శిక్షణ మరియు డాన్స్ తదితర విషయాలలో శిక్షణ ఇస్తున్నాడు.

 కానీ ఏమైందో ఏమో గాని ఇటీవలే పుల్లయ్య రాకేష్ మాస్టర్ ని వదిలిపెట్టి బయటకు వచ్చి అతడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇందులో భాగంగా రాకేష్ మాస్టర్ తనని అప్పుడప్పుడు అసభ్య పదజాలంతో దూషించాడని అంతేగాక తనతో వెట్టి చాకిరీ చేయించుకొనేవాడని అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

దీంతో తాజాగా రాకేష్ మాస్టర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పుల్లయ్య పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇందులో తనని కన్న కొడుకు లాగా చూసుకునే వాడినని చెప్పుకొచ్చాడు.

  అంతేగాక పుల్లయ్య కి మెచ్యూరిటీ లేదని అందువల్లే ఎవరో చెప్పినటువంటి మాటలు విని తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని నిజానిజాలను తెలుసుకోవాలని సూచించాడు.గతంలో కూడా తనని ఇలాగే కొంతమంది వాడుకొని మోసం చేశారని కానీ తనకు ఏమాత్రం బాధ లేదని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube