ప్రస్తుతం సినిమా పాటలకు ఎంత క్రేజ్ ఉందో అదేవిధంగా యూట్యూబ్ లో వచ్చే జానపద పాటలకు కూడా అంతే క్రేజ్ వుంది.ఇంకా చెప్పాలి అంటే కొన్ని వర్గాల ప్రేక్షకులు ఎక్కువగా జాన పదాలతో వచ్చే పాటలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
యూట్యూబ్ లో విడుదలైన పలు జానపద పాటలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి.మరి ఈ ఏడాది జానపదం తో ఇచ్చిన ఆ టాప్ సాంగ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లెట్ బండి : కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారుమోగిపోయింది.పెళ్లిళ్లలో, ఫంక్షన్ లలో ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపించింది.
షాద్ నగర్ కుర్రాడు లక్ష్మణ్ రాసిన ఈ పాటని మోహన భోగరాజు ఆలపించింది.ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్లో 18 కోట్లు వచ్చాయి.
బావల్ల నా బావల్ల : బావల్లా నా బావల్లా.ఎంతా సక్కని బావల్లా.
అంటూ శిరీష చేసిన ఈ పాట చాలా మంది ఫిదా అయ్యారు.ఇప్పటికీ ఇంటింటిలో ఇది మార్మోగుతూనే ఉంది.
యూట్యూబ్‌లో అయితే రెండున్నర కోట్ల మంది చూశారు.శిరీష ఈ సాంగ్‌లో పాడటమే కాదు.
ఆడింది కూడా.పాట రాసింది, సంగీతం, దర్శకత్వం.
అన్నీ తిరుపతి మాట్లనే.
గున్నా గున్నా మావిళ్లల్ల : ఈ పాట కూడా కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.ఎక్కడ చూసినా కూడా ఇదే పాట వినిపించింది.ఈ పాటకు యూట్యూబ్ లో రెండు కోట్లు వచ్చాయి.
చంద్ర ప్రకాష్ రాసిన లిరిక్స్ కి సింగర్ తేజస్విని హుషారైన గొంతు తోడయింది.ఈ పాట తో పాటు ఈ పాటలో ఉన్న స్టెప్పులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
వెళ్లురా ఓ మనిషి వెళ్లురా : నువ్వు కట్టుకున్న బంగుళా దాసుకున్న పైసలు.ఏవి రావురో.నీ వెంట రావురో.అంటూ జీవిత సారాన్ని ఒక్క పాటలో అర్థం అయ్యే విధంగా చెప్పారు.ఈ పాట లోని పదాలు పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ పాటకు ఇప్పటివరకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
ఉంగురమే : ఊరెనక దున్నిచ్చి.ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే అంటూ మామిడి హుషారు గా పాట పాడింది.
ఈ పాట విడుదల అయినా మూడు నెలల్లో పై రెండు వేల కోట్ల వ్యూస్ వచ్చాయి.