హీరో సిద్దార్థ కెరియర్ నాశనమవ్వడానికి కారణం అదేనా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు చిత్రం లో హీరోగా నటించి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి ప్రముఖ హీరో “సిద్ధార్థ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సిద్ధార్థ తమిళం మరియు తెలుగు భాషలలో తెరకెక్కిన “బాయ్స్” అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 Telugu Hero Siddharth Cinema Career Collapse News-TeluguStop.com

వచ్చీ రావడంతోనే  తన మొదటి చిత్రంతో అవార్డును కూడా దక్కించుకున్నాడు.అంతేకాక “రంగ దే బసంతి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.

దీంతో సిద్ధార్థ కి తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఏర్పడింది.

అయితే ఈ మధ్య కాలంలో సిద్ధార్థ హీరోగా నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

ఇందుకు ముఖ్య కారణాలుగా సిద్ధార్థ ఎంచుకున్న కథలని కొందరు చర్చించుకుంటున్నారు.దీనికితోడు ఒకప్పుడు సిద్ధార్థ టాలీవుడ్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పేరున్న హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపాడని,  దాంతో ఆ మధ్య టాలీవుడ్ హీరోయిన్ ఏకంగా సిద్ధార్థతో ప్రేమాయణం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో హీరో సిద్ధార్థ వ్యక్తిగతంగా కూడా కొంతమేర డిస్టబ్ అయ్యాడని ఆ మధ్య టాక్ వినిపించింది.

కాగా నాలుగు పదుల వయస్సు దాటినప్పటికీ హీరో సిద్ధార్థ యంగ్ గా కనిపిస్తూ హీరోగా నటిస్తున్నాడు.

అయితే సిద్ధార్థ హీరోగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా పలు పాటలను పాడి బాగానే ప్రేక్షకులను అలరించాడు.కానీ సిద్ధార్థ తన సినీ జీవితంలో ప్రేమాయణాల వల్లే తన సినీ కెరీర్ పై దృష్టి సారించ లేకపోతున్నాడని కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం సిద్దార్థ తన భార్యకి విడాకులు ఇచ్చి కొడుకుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం.కాగా ఆ మధ్య తెలుగులో “వదలడు” అనే చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో సిద్ధార్థ తెలుగులో “మహా సముద్రం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో శర్వానంద్ కూడా సిద్ధార్థ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “ఇండియన్ 2” అనే చిత్రంలో కూడా సిద్ధార్థ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

hero-siddharth-cinema-career-collapse-news
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube