టీడీపీ కీలక వ్యూహం... వ్యతిరేక ఓటు సానుకూలంగా మారేనా?

2019 ఎన్నికల ఫలితాల్లో బొక్కాబోర్లా పడ్డ తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పుంజుకుని మళ్లీ అధికారం చేపట్టాలని కృతనిశ్చయంతో కనిపిస్తోంది.దీని కోసం తన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలన్నీ వాడుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

 Telugu Desam Party Key Strategy ... Will The Anti-vote Turn Positive?.. Andhra P-TeluguStop.com

ఫోకస్ అంతా కూడా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవడంపైనే పెట్టింది.ఈ క్రమంలో వైసీపీపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలు, ప్రజలు, సామాజిక వర్గాల వారీగా తెలుగు దేశం పార్టీ సోషల్ వింగ్ ఐటీడీపీ సమాచారం సేకరిస్తోంది.

సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా ఎవరు గళం వినిపించినా వారిని ఐటీడీపీ గుర్తిస్తోంది.వారిని టీడీపీకి చేరువ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది.

గుంటూరు జిల్లా కంతేరుకు చెందిన ఎస్సీ మహిళ వెంకాయమ్మ విషయంలో ఐటీడీపీ కృషి ఎంతో ఉందని.ప్రభుత్వంపై వెంకాయమ్మ కుటుంబంలో ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేయడంలో ఐటీడీపీ సక్సెస్ సాధించిందనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ఐటీడీపీ కార్యకర్తలంతా భాగస్వామ్యం కావాలని గతంలో నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తోందని ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో యూత్ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఇక్క‌డ త‌మ వాయిస్‌ను బ‌లంగా వినిపించి ఇత‌ర పార్టీల మీద వ్యతిరేక‌త తీసుకొస్తే పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని ఐటీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap Poltics, Chandrababu, Telugu Desam, Ys Jagn-Telugu Pol

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ ఐటీడీపీ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత నెట్టింట్లో టీడీపీ వాయిస్ బ‌లంగా వినిపిస్తోంది.ఇటీవల పదోతరగతి ఫలితాల సందర్భంగా నిరాశలో ఉన్న విద్యార్థులతోనూ టీడీపీ మమేకం అయ్యింది.ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవకాశం కనిపించినా టీడీపీ దూకుడగా ముందుకు సాగుతుండటంతో ఆయా వర్గాలు పార్టీకి చేరువ అవుతున్నాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.వైసీపీ వ్యతిరేక ఓటును టీడీపీ అనుకూలంగా మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube