తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో కీలకం అయ్యేందుకు అప్పట్లో చాలానే ప్రయత్నించారు.
ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ,తాను అన్ని విధాలుగా సహకరిస్తానంటూ గతంలోనే రేవంత్ పార్టీ అగ్రనేతల దగ్గర వ్యాఖ్యానించారు.దీనికి తగ్గట్లుగానే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం అంటూ ప్రకటనలు చేస్తూ.వివిధ సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు.
దీంతో ఏపీ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేయనున్నారు.ఈ మేరకు రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన ఖరారు అయింది.

ఈనెల 11వ తేదీన విశాఖలో నిర్వహించబోయే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ( Steel Plant Privatization ) ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నారు.తెలంగాణ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించబోతున్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వంతో పాటు, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని రేవంత్ విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన స్పందిస్తూ జగన్ పైన రేవంత్ విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వాస్తవంగా రేవంత్ రెడ్డి గతంలో టిడిపిలోనే ఉండేవారు ఇప్పటికీ ఆయనకు రాజకీయ గురువుగా చంద్రబాబు పేరే వినబడుతుంది.ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టిడిపికి కలిసి వచ్చే విధంగా రేవంత్ పరోక్షంగా సహకారం అందించే విధంగా వైసిపి ప్రభుత్వాన్ని( YCP ) టార్గెట్ చేసుకుని ప్రజల్లో చర్చ జరిగే విధంగా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వీలైనంత ఎక్కువ పర్యటనలు ఏపీలో ఉండే విధంగా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్న కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో బలోపేతం చేసి కొన్ని స్థానాలు అయినా గెలిచే విధంగా రేవంత్ రెడ్డి షర్మిలతో( Ys Sharmila ) కలిసి ఎన్నికల ప్రచారం చేసి, ఆ క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసుకునే విధంగా ముందుకు వెళ్ళబోతున్నరట.రేవంత్ పర్యటన లో పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది.