తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చినా భూ సమస్యలు మాత్రం తీరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో భూ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మహేశ్వరంలో తహసీల్దార్ నిషేధిత జాబితాలోని రూ.200 కోట్లు విలువ చేసే భూమికి కన్నం వేశారని తెలుస్తోంది.రాజధాని శివారు ప్రాంతమే కాకుండా త్వరలోనే ప్రారంభం కానున్న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మాసిటీకి సమీపంలో ఈ భూదందా తెరపైకి వచ్చింది.నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181లో మొత్తం 101 ఎకరాల భూమిలో 52 ఎకరాలు గైయిరాన్ భూమి కాగా మిగతాది భూదాన్ ల్యాండ్ గా గుర్తించారు.
అయితే అహ్మద్ జబర్దస్ట్ ఖాన్ పేరు మీద భూమి ఉందని ఆయన కుమారుడు వాదన కొనసాగుతుండగా ఎమ్మార్వో మాత్రం పట్టా భూములని రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తహశీల్దార్ భూ దందాపై ఈడీ, సీబీఐకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది.