తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రత్యేకంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అలాగే తన భార్యకు విజయ్ పార్టీ రాజకీయాల్లోకి( Politics ) రావడం ఇష్టం లేదని, అందుకు ఆమె అంగీకరించలేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ గత కొద్ది రోజులుగా మాత్రం ఈ వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి.ఆ సంగతి అటువంటి ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లోకి ఎంతో మంది నటీనటులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కరుణానిధి,( Karuna Nidhi ) ఎం.జి రామచంద్రన్,( MG Ramachandran ) జయలలిత,( Jayalalitha ) టి.రాజేందర్, రాధా రవి, కారుణాస్, గౌతమి, సీమాన్, శరత్ కుమార్, కుష్బూ, విజయ్ కాంత్, కమల్ హాసన్, తాజాగా ఉదయనిది స్టాలిన్.ఇలా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు కానీ అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
అయితే చాలాకాలంగా స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై( Vijay Political Entry ) ప్రచారం జరుగుతోంది.విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
2022 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ ఇయక్కమ్( Makkal Iyakkam ) తరపున అభ్యర్థులను బరిలోకి దింపాడు.అలా మొత్తం 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు.దీంతో రాజకీయ పార్టీ ప్రారంభించాలని విజయ్ ని పలువురు డిమాండ్ చేశారు.కాగా తాజా సమాచారం ప్రకారం విజయ్ కూడా రాజకీయాలపై చర్చించారని, మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయం పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.