స్టార్‌ హీరో సినిమా ఇక సర్దేసుకోవడమేనా?

ఆయన తమిళంలో ఓ స్టార్ హీరో.తెలుగులో కూడా ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.ముఖ్యంగా ఆయన నటించిన అపరిచితుడు సినిమా తెలుగులో ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే రూ.100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఉంటుంది అనేది టాక్.ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన కెరియర్ ఏ మాత్రం సరిగా లేదు గత పది సంవత్సరాలుగా ఆయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.కనీసం తమిళంలో అయినా ఆయన సక్సెస్ లను దక్కించుకుంటున్నాడా అంటే అది కూడా లేదు అంటూ తమిళ సినీ విశ్లేషకులు అంటున్నారు.

 Tamil Hero Vikram Back To Back Getting Flops , Tamil Hero, Vikram, Kobra, Ponn-TeluguStop.com

ఇప్పటికే ఆయన ఎవరో అర్థం అయ్యింది కదా.ఔను విక్రమ్‌.తాజాగా వచ్చిన కోబ్రా సినిమా కూడా నిరాశ పరిచింది.భారీ అంచనాల నడుమ అపరిచితుడు రేంజ్ లో ఉంటుంది అంటూ విడుదల చేసిన కోబ్రా సినిమా తమిళంలో సో సో సో గా ఆడింది కానీ తెలుగులో మొదటి రోజే ఖాళీ కుర్చీలు కనిపించాయి.

ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఒకటి రెండు సంవత్సరాల్లో విక్రమ్ తన హీరో పాత్రలను వదిలేసి సర్దేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో ఇప్పటికే చాలా ఫ్లాప్స్ మూట కట్టుకున్న ఈయన ముందు ముందు నటించే సినిమాలు ఏ ఒక్కటి కూడా డబ్బింగ్ చేసేందుకు తెలుగు నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

 Tamil Hero Vikram Back To Back Getting Flops , Tamil Hero, Vikram, Kobra, Ponn-TeluguStop.com

ఒక వైపు కొడుకుని హీరోగా తీసుకొచ్చి మరో వైపు ఈయన హీరోగా చేస్తే ఎవరు చూస్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విక్రమ్ ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పొన్నియన్‌ సెల్వన్‌.

ఈ సినిమా ఈ నెల 30 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ అయితే తప్ప విక్రమ్‌ మరో రెండు మూడు సంవత్సరాల పాటు హీరోగా కొనసాగే పరిస్థితి లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఆ సినిమా ఫలితం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube