సుజుకి నుంచి మరో స్టైలిష్ బైక్ సుజుకి గిక్సర్ SF 250( Suzuki Gixxer SF 250 ) అద్భుతమైన భద్రత ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.ఈ బైకు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
ఈ బైక్ 249cc ఇంజన్ తో శక్తివంతంగా పనిచేస్తుంది.ఈ బైకుకు ముందు, వెనక భాగాలలో ఉండే డిస్క్ బ్రేకులు రహదారిపై రైడర్ కు గట్టిపట్టును ఇస్తాయి.
ఈ బైక్ లో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం అందుబాటులో ఉంది.ఇది రెండు టైర్లను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఈ బైక్ లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్( Manual Transmission ( ఉంది.
ఒక గంటకు గరిష్టంగా 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఈ బైక్ 35kmpl మైలేజ్ ఇస్తుంది.ఈ బైక్ సీటు ఎత్తు 800 మిమీ.
ఈ బైక్ ఆపరేట్ చేయడం చాలా సులభం.పొడవైన మార్గాల్లో ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.26.13 bhp పవర్,22.2NM గరిష్ట టార్క్ ను కలిగి ఉంది.ఈ బైక్ లో ట్యూబ్ లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఎల్ఈడి హెడ్ల్యాంప్, టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, క్లిప్ ఆన్ హ్యండిల్ బార్, డ్యూయల్- బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి.
బైక్ వెనుక సెట్ ఫుట్ పెగ్లు, స్ప్లిట్-గ్రాబ్ రైల్ ఉన్నాయి.ఈ బైక్ లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.ఈ బైక్ లో డ్యూయల్ ఛానెల్ యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టం ఉంది.
ఈ బైక్ KTM RC 200, బజాజ్ పల్సర్ 200 లకు గట్టి పోటీ ఇవ్వనుంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.1.94 లక్షలు( Suzuki Gixxer SF 250 Price ).ఈ బైక్ టాప్ మోడల్ ధర రూ.2.07 లక్షలు.