క్రాక్ సినిమా ద్వారా తెలుగులో విలన్ పాత్రలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ఈమె నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం యశోద సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
యశోద సినిమా సరోగసి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇదే విషయం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ ను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ సరోగసి పెద్ద కాంప్లికేటెడ్ విషయం కాదు అయితే కొందరు నటీమణులు సరోగసి పద్ధతిని అనుసరించడం వల్ల ఈ విషయం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని ఈమె తెలిపారు.
ఈ కథలో సరోగసి అనేది కేవలం ఒక టాపిక్ మాత్రమే ఇందులో మంచి చెడు గురించి ఏమాత్రం చెప్పలేదని తెలిపారు.ఇకపోతే సెలబ్రిటీలు సరోగసి విధానాన్ని అనుసరిస్తే వారి గురించి డిస్కషన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఈ క్రమంలోనే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈమె మాట్లాడుతూ మీరు ఒక సెలబ్రిటీకి అభిమాని అయితే వారు చేసే సినిమాలు చూడండి అవి ఎలా ఉన్నాయో చెప్పండి అంతేకానీ,వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు మీకు ఏమాత్రం లేదు అంటూ ఈమె నిర్మొహమాటంగా చెప్పారు.ఇలా వారి విషయాలను పక్కనపెట్టి ఇతరుల గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే వారికి ఎలాంటి పని పాట ఉండదు కనుక ఇతరుల జీవితాలలోకి తొంగి చూస్తూ ఉంటారంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.