50 ఏళ్ల క్రితం తమిళనాడులో అదృశ్యం.. న్యూయార్క్‌లో ప్రత్యక్షమైన చోళుల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం

కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే ఆనాదిగా ఈ రత్నగర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.

 Stolen Goddess Parvati Idol In Tamilnadu , Found In New York After 50 Years  , N-TeluguStop.com

నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.

వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద.

ఖండాలు దాటుతోంది. కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.

అలా భారతీయ సంపద.విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.

అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు కొందరి కృషి ఫలితంగా ఆ అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.

ఇకపోతే.

దాదాపు 50 ఏళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో కనిపించకుండాపోయిన పార్వతీ దేవి విగ్రహం న్యూయార్క్‌లో గుర్తించినట్లు తమిళనాడు ఐడల్ వింగ్ సీఐడీ సోమవారం ప్రకటించింది.న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్ ఆక్షన్ హౌస్‌లో ఇది వున్నట్లు సీఐడీ తెలిపింది.

Telugu York, Goddessparvati, Vasu, Stolengoddess, Tamilnadu-Telugu NRI

1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ .2019లో కె.వాసు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై విగ్రహ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.అయినప్పటికీ విచారణ మాత్రం పెండింగ్‌లోనే వుంది.

ఐడల్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం చిత్ర దర్యాప్తు చేపట్టిన తర్వాత.విదేశాలలో వివిధ మ్యూజియంలు, ఆక్షన్ హౌస్‌లలో చోళుల కాలం నాటి పార్వతి విగ్రహాల కోసం గాలించారు.ఈ క్రమంలోనే నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలోని పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్‌లో వున్నట్లు తేలింది.12వ శతాబ్దంలో చోళుల కాలం నాటిదిగా భావిస్తున్న రాగి, ఇతర లోహ మిశ్రమాలతో తయారైన ఈ పార్వతి దేవి విగ్రహం ఎత్తు 52 సెం.మీ.ప్రస్తుతం దీని విలువ 2,12,575 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1,68,26,143) అని ఐడల్ వింగ్ తెలిపింది.

విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ఐడల్ వింగ్ సీఐడీ డీజీపీ జయంత్ మురళి బృందం పత్రాలను సిద్ధం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube