ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన సందర్శించారు.
గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా అప్పులు చేసిందని భట్టి ఆరోపించారు.వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టారన్నారు.పవర్ పర్చేజ్ పేరుతో రూ.59,580 కోట్ల బకాయిలు పెట్టారని మండిపడ్డారు.రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ బకాయిలు రూ.7 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.అలాగే సింగరేణికి రూ.19 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.జెన్ కో కట్టాల్సిన బకాయిలు రూ.9 వేల కోట్లకు పైనే ఉన్నాయన్న ఆయన విద్యుత్ శాఖను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.