బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి( Sreemukhi )వెండి తెరపై మెరవాలని దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.బుల్లి తెరపై అడుగు పెట్టినప్పటి నుండి వెండి తెర వైపు చూస్తూనే ఉంది.
ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది.
హీరోయిన్ గా చేసిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు.దాంతో ఈ ముద్దుగుమ్మ కి టైమ్ కలిసి రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం యాంకర్ గా తెలుగు బుల్లి తెర పై వరుస కార్యక్రమాలతో దూసుకు పోతుంది.ఇలాంటి సమయంలో ముద్దుగుమ్మ శ్రీముఖి వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) లో కీలక పాత్రలో కనిపించబోతోంది.అంతే కాకుండా సినిమాలోని ఒక సన్నివేశంలో చిరంజీవితో కలిసి ఖుషి( Khushi ) నడుము సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయబోతోంది.కొన్ని నిమిషాల పాటు భూమిక( Bhumika Chawla ) అవతారం ఎత్తబోతోంది.నడుము అందాలను చూపిస్తూ కవ్వించబోతోంది.కనుక ఈ సినిమా తర్వాత కచ్చితంగా శ్రీముఖి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతానంటూ నమ్మకంగా ఉంది.
అంతే కాకుండా ఇతర భాషల్లో కూడా శ్రీముఖి సినిమాలు చేయాలని ఆశ పడుతుంది.అందుకోసం చర్చల దశలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం అందుతోంది.శ్రీముఖి బుల్లి తెర పై ఎంత బిజీగా ఉన్నా వెండి తెర పై అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
భోళా శంకర్ సినిమా తర్వాత యంగ్ హీరోల సినిమాల్లో కాకుండా సీనియర్ హీరోల సినిమాల్లో అయినా కీలక పాత్రల్లో ఈ అమ్మడు నటిస్తూ బిజీగా ఉండే అవకాశం ఉంది.