Lavanya Tripathi : ఆ నాడు సమంత విడాకులు ..నేడు లావణ్య త్రిపాఠి పెళ్లి..ఎప్పుడు మీడియాదే విజయం

సోషల్ మీడియా( social media ) కు పవర్ ఎక్కువ.చాల మంది సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ వస్తుంది అంటూ ఎగతాళిగా మాట్లాడతారు.

 Social Media Is Not Baseless-TeluguStop.com

మేము అస్సలు సోషల్ మీడియాలో లేము అంటూ బిల్డప్ ఇస్తూ ఉంటారు.సెలెబ్రిటీలు లు కూడా ఇలాగె మాట్లాడతారు.

చాల స్క్రాప్ వస్తుంది అని చాల చీప్ గా మాట్లాడుతూ ఉంటారు కానీ నిప్పు లేనిదే పొగ రాదు.కొన్ని సార్లు సోషల్ మీడియా చేసే అతి దారుణం గా ఉన్నప్పటికి ఎక్కువ సార్లు సోషల్ మీడియా నిజాలను తనదైన రీతిలో చెప్తూ ఉంటుంది.

ఉదాహరణకు సమంత నాగ చైతన్య( Samantha ) విడాకుల విషయం సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అటు అక్కినేని ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా ను ఆడి పోసుకున్నారు.

Telugu Lavanya Tripati, Naga Chaitanya, Samantha, Tollywood, Varun Tej-Telugu To

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ తిట్ల దండకం అందుకున్నారు.కానీ చివరికి ఏమైంది.ఒక మంచి ముహూర్తం చూసుకొని డిజైన్ చేయించుకొని మరి ఒకే రకమైన విడాకుల ప్రకటన అటు చై ఇటు సమంత ఒకే సమయంలో ప్రకటన చేసారు.

అప్పుడు కానీ అందరి నోళ్లు మూత పడలేదు.ఇక చాల రోజులుగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు కాబోతుంది అని అందరు అంటూనే ఉన్నారు.సోషల్ మీడియా లో, వెబ్ సైట్స్, యూట్యూబ్ లలో వరుణ్ తేజ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన లావణ్య త్రిపాఠి అంటూ వందల కొద్దీ వార్తలు వచ్చాయి.

Telugu Lavanya Tripati, Naga Chaitanya, Samantha, Tollywood, Varun Tej-Telugu To

ఈ వార్తలను మొదట్లో గాలి వార్తలు గానే అందరు చూసారు.కానీ ఆ వార్తల జోరు పెరుగుతన్న కొద్దీ నిజమేమో అనే అనుమానాలు మొదలయ్యాయి .ఇది ఎక్కడ వరకు వెళ్లిందంటే లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )ని ఒక సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మీకు వరుణ్ తేజ్ కి ఎలాంటి బంధం ఉంది అనే వరకు వెళ్ళింది.లావణ్య చాల తెలివిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంది కానీ ఇప్పుడు వారి వెడ్డింగ్ తేదీ తో పాటు ఎంగేజ్మెంట్ డేట్ కూడా వచ్చేసింది.ఇలా సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా ఫేక్ న్యూస్ అనే నిర్దారణకు రాకుండా కాస్త ఆలోచిస్తే బాగుంటుంది.

ఏది ఏమైనా సోషల్ మీడియా ఎవరికైనా పెళ్లి చేయగలదు, వారికి తెలియకుండానే విడాకులు ఇప్పించగలదు.కలికాలం మరి.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube