హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధానమైన పాత్రలలో నటించిన తాజా చిత్రం సీతారామం. ఈ సినిమా ఈ నెల 5వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మించిన విషయం తెలిసిందే.ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బంధం సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
ఈ సక్సెస్ మీట్ లో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.
ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు.నేను అంత షాక్ లో ఉన్నాను.
ఇంతకుముందు నాలుగైదు సినిమాలు చేశాను.కానీ మొదటిసారి ఈ స్థాయి రెస్పాన్స్ ను చూస్తున్నాను.
అయితే ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు.ప్రథమ పాదం కూడా వాళ్లదే.
మిగిలిన శేషం ఏదైనా ఉంది అంటే నేను తీసుకోవాలి అంతే.నాపై మణిరత్నం ప్రభావం చాలా ఉందని చాలామంది చెబుతుంటారు.
అయితే అందుకు గల కారణం గీతాంజలి సినిమా నాపై చూపించిన ఎఫెక్ట్ కావొచ్చు.
అది ఆల్ టైమ్ నా ఫేవరేట్ సినిమా అది.నేను ఆ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను.ఇక దుల్కర్ సల్మాన్ కూడా నా పిచ్చిని నవ్వుతూ భరించాడు.
నేను ఏం చెబితే అది చేయడానికి రెడీ అంటూ ముందుకు వచ్చాడు.నేను ఆయనకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు హను రాఘవపూడి.
ఈ సినిమా క్రెడిట్ లో సింహభాగం స్వప్నగారిదే.ఎందుకంటె నన్ను నమ్మొద్దని స్వప్నకి చాలామంది చెప్పారు.అయినా ఆమె నన్ను నమ్ముకుని ఈ సినిమా చేసింది.నాతో ఆమె సీతారామం తీయించింది అంటూ చిత్ర బృందం ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు హను రాఘవపూడి.